ఒకేసారి విడుదల చేయనున్నట్లు విద్యా శాఖ వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : ఇంటర్ మొదటి, రెండవ సంవత్సర పరీక్షా ఫలితాలు ఈ నెల 24న ఒకేసారి విడుదల చేయనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ అధికారులు తెలిపారు. 24న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. కాగా ఈ సంవత్సరం ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలను ప్రభుత్వం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
మూలాంకనాన్ని మార్చి 10 నుంచి ప్రారంభించి ఈ నెల 10 కల్లా పూర్తి చేశారు. ఈ విధంగా గతేడాదితో పోల్చితే ఈ సారి 15 రోజుల ముందే ఫలితాలు వెలువడడం గమనించదగ్గ విషయం. కాగా గతంలో లాగా ఎలాంటి అవకతవకలు జరుగకుండా, మార్కుల నమోదులో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు.కాగా ఈ నెల మొదటి వారంలో ఓఎంఆర్ షీట్ల డీ కోడిరగ్, మార్కులు ఆన్‌లైన్‌లో నమోదు చేసిన తర్వాత కూడా అన్ని విధాలా పరిశీలన చేసిన అనంతరం ఎలాంటి సమ్యలు తల్తెక పోవడంతో ఫలితాలను విడుదల చేయడానికి నిర్ణయించారు.




