‘‘దృఢమైన శరీరంలోనే బలమైన మెదడు ఉంటుంది (స్ట్రాంగ్ మైండ్ ఇన్ స్ట్రాంగ్ బాడీ)’’ అనేది క్రీడా నినాదం. దేహ దృఢత్వానికి పునాది క్రీడలు. ప్రపంచ క్రీడా పో టీల్లో సర్వోత్తమమైనవి ఓలం పిక్ క్రీడలు. 1896లో గ్రీస్‌లో ప్రారంభమైన ఓలంపిక్ క్రీడ లు నాలుగేళ్లకు ఒకసారి నిర్వ హిస్తూ చివరగా 20 20లో జపాన్‌లో నిర్వహిం చబడ్డాయి. సమీప భవిష్యత్తులో 2024లో ఫ్రాన్స్, 2028లో యూఎస్, 2032లో ఆస్ట్రేలియా నిర్వహించడానికి ఇంటర్నేషనల్ ఓలంపిక్ కమిటీ, ఐఓసి నుంచి అనుమతులు పొంది భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. వీటితో పాటు 1924 నుంచి ‘వింటర్ ఓలంపిక్స్’ కూడా నిర్వహిస్తున్నారు. ఇటీవల 91 దేశాలకు చెందిన 2,871 మంది క్రీడాకారులు పాల్గొన్న 2022 క్రీడల్ని చైనా నిర్వహించింది. 2026 వింటర్ ఓలంపిక్ క్రీడల్ని ఇటలీ నిర్వహించనున్నది. ప్రపం• •వ్యాప్తంగా 206 దేశాల జాతీయ ఓలంపిక్ కమిటీలను ఐఓసి (అంతర్జాతీయ ఓలంపిక్ కమిటీ) గుర్తించింది.
ఓలంపిక్ క్రీడల నిర్వహణకు మన అర్హతలు ఏమిటి !
వేగంగా అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి చెందుతున్న భారతదేశం, ప్రపంచ దేశాల ముందు, ముఖ్యంగా ఆసియా దేశాల్లో ప్రముఖ దేశంగా సగర్వంగా నిలబడుతున్న వేళ ఓలంపిక్ క్రీడలకు వేదిక కావాల నుకోవడం ముదావహం. ఓలంపిక్స్ నిర్వహించడం ఓ అద్భుత అవకాశం. ప్రపంచ ప్రఖ్యాతిగల ఓలంపిక్స్ నిర్వహిస్తున్న దేశం వైపు 16 రోజుల పాటు విశ్వ మానవాళి దృష్టి ఆకర్షితమవుతుంది. 2036లో ఓలంపిక్ క్రీడలను భారత్ నిర్వహించడానికి సిద్ధంగా ఉందని మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించడం దేశ వాసుల సంతోషానికి మరింత కారణమయ్యింది. ఓలంపిక్స్ నిర్వహణ ఓ సవాళ్లతో కూడుకున్న అంశం. విశ్వ క్రీడాపోటీల నిర్వహణ ద్వారా మంచి పేరు రావచ్చు లేదా ఆబాసుపాలు కూడా కావచ్చని గత పలు అనుభవాలు చాటుతున్నాయి. ఓలంపిక్స్ను సమర్థవంతంగా నిర్వహించుట ద్వారా ప్రపంచ ప్రజలు, క్రీడాకారులు, క్రీడాభిమానుల దృష్టిని ఆతిథ్య దేశం ఆకట్టుకుంటుంది.
అంతర్జాతీయ ఓలంపిక్ కమిటీ, జాతీయ ఓలంపిక్ కమిటీల పాత్ర :
ఓలంపిక్ క్రీడల నిర్వహణ భాద్యత ‘‘అంతర్జాతీయ ఓలంపిక్ కమిటీ (ఇంటర్నేషనల్ ఓలంపిక్ కమిటీ, ఐఓసి)’’తో పాటు ‘‘జాతీయ ఓలంపిక్ కమిటీ (నేషనల్ ఓలంపిక్ కమిటీ, ఎన్ఓసి)’’ల పైన మాత్రమే ఉంటుంది. ఈ క్రీడల నిర్వహణలో ప్రభుత్వ విభాగాల ప్రమేయం కూడా మరువలేనిది. ప్రభుత్వ సహకారంతో ఎన్ఓసి అభ్యర్థన అనంతరం ఏ దేశంలో నిర్వహించాలనే నిర్ణయాన్ని ఐఓసి తీసుకుంటుంది. ఐఓసి నిర్ణయం ద్వారా ఎన్ఓసి సంస్థకు ఓలంపిక్ క్రీడలు నిర్వహించడానికి బాధ్యత ఇవ్వబడుతుంది. ఓలంపిక్స్ నిర్వహణకు అవసరమయ్యే భారీ మౌళిక వనరుల కల్పన, క్రీడాభివృద్ధి, ప్రజల భాగస్వామ్యం, సామాజిక సౌకర్యాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పూర్తి సమన్వయ సహకారాలు మరింతగా అవసరమవుతాయి. ఓలంపిక్స్‌లో పతకాల గెలుపుతో పాటు సమర్థవంతమైన విశ్వ క్రీడల నిర్వహణ అనుభవాలు, పలు విభాగాల సమన్వయ సామర్థ్యాలు కూడా కావలసి వస్తుంది.





