Day March 17, 2026

కాబూల్‌పై పాకిస్తాన్ వైమానిక దాడి

-400 మంది మృతి -250 మందికి గాయాలు – ఆయుధ డిపోపై దాడి చేశాం:  పాక్‌ – ఇది అబ‌ద్ధ‌మ‌న్న తాలిబ‌న్ ప్ర‌భుత్వం ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, హైదరాబాద్, మార్చి 17:  కాబూల్‌లోని ఒక డ్రగ్ రిహాబిలిటేషన్ సెంటర్‌ (మత్తుపదార్థాల విముక్తి పున‌రావాస కేంద్రం)పై పాకిస్తాన్ సోమవారం రాత్రి జరిపిన వైమానిక దాడిలో కనీసం 400…

పెచ్చుమీరుతున్న రాజకీయ దాడులు

– పోలీసుల పక్షపాత వైఖరి – డీజీపీకి బీజేపీ బృందం ఫిర్యాదు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 17: రాష్ట్రంలో పెచ్చుమీరుతున్న రాజకీయ దాడులతోపాటు పోలీసుల పక్షపాత వైఖరిపై డీజీపీకి బీజేపీ బృందం ఫిర్యాదు చేసింది. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు నేతృత్వంలోని పార్టీ ప్రతినిధుల బృందం రాష్ట్ర డీజీపీ బి.శివధర్‌రెడ్డిని మంగళవారం కలిసి వినతిపత్రం సమర్పించింది.…

20న ఫార్మసిస్ట్ పోస్టులకు జాబ్ మేళా

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 17 : ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయిమెంట్ బ్యూరో ఆధ్వర్యంలో అపోలో ఫార్మసీ ఈ నెల 20న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయిమెంట్ బ్యూరో కార్యాలయంలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు. అపోలో ఫార్మసీలోని ఫార్మసిస్టు, అసిస్టెంట్ ఫార్మసిస్టులకు చెందిన…

అబద్దాలు, సెటైర్లు వేయడం మానుకో

  – మహిళలకు ఎవరేం చేశారో వారినే అడుగుదాం – అసెంబ్లీలో కేటీఆర్‌కు కౌంటర్‌ ఇచ్చిన మంత్రి సీతక్క హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి17: మహిళలంటే మాజీ మంత్రి కేటీఆర్‌కు చిన్నచూపని మంత్రి సీతక్క అన్నారు. తెలంగాణ శాసనసభలో గవర్నర్‌ ‌ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ  సందర్భంగా కేటీఆర్‌పై మంత్రి సీతక్క విరుచుకుపడ్డారు. కుటుంబ సభ్యులైనా, బయట మహిళలనైనా…

భగ్గుమన్న బంగారం ధర

– సగటున పది గ్రాములపై 1200 పెరుగుదల న్యూదిల్లీ, మార్చి 17: కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు మంగళవారం ఒక్కసారిగా భగ్గుమన్నాయి. దేశంలో మేలిమి బంగారం ధర సగటున రూ.1200ల మేర పెరిగింది. వెండి ధర కూడా సగటున రూ.5 వేల మేర ఎగబాకింది. ధరలు దిగివచ్చినప్ప్పుడు వందల్లో దిగుతూ పెరిగితే వేలల్లో…

టీపీసీసీ సమన్వయ కమిటీ ఏర్పాటు

Gandhi Bhavan

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 17: రాష్ట్రంలో పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం కోసం టీపీసీసీ సమన్వయ కమిటీని ఏఐసీసీ నియమించింది. ఎనిమిదిమందితో కూడిన కమిటీని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ ప్రకటించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్…

నందిని సిధారెడ్డికి సీఎం అభినందనలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 17: ప్రముఖ కవి, రచయిత నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం-2025 లభించడంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిధారెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. కరోనా మహమ్మారి కాలంలో మానవాళి ఎదుర్కొన్న సంక్షోభాలను, మానవ సంబంధాల విచ్ఛిన్నతలను అనిమేష అనే కవితా సంపుటిలో హృద్యంగా తెలియజేసిన…