Day March 9, 2026

ఏసీబీ వలలో చిక్కిన ఏఆర్ ఎస్సైలు

–  లక్ష లంచం తీసుకుంటుండగా పట్టివేత హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 9: సైబర్‌ ‌క్రైం కేసులో అరెస్టు చేయకుండా ఉండడానికి ఫిర్యాదుదారుడు నుంచి లంచం తీసుకుంటూ ఇద్దరు ఆర్‌ఎస్సైలు ఏసీబీకి చిక్కారు. మల్కాగిజిరి పోలీస్‌ ‌కమిషనరేట్‌ ‌పరిధిలోని ఎల్‌బీ నగర్‌ ‌సైబర్‌‌క్రైం పోలీసు స్టేషన్‌కు చెందిన ఇద్దరు ఎస్సైలు ప్రమోద్‌ ‌గౌడ్‌, ‌జటావత్‌ ‌బాబు నాయక్‌…

నిరుద్యోగులను మోసగించిన ప్రభుత్వం

– ఉద్యోగ నోటిఫికేషన్లపై హామీలకు దిక్కేది – అసెంబ్లీలో అన్ని సమస్యలపైనా నిలదీస్తాం – ఎమ్మెల్యే వేముల ప్రశాంత రెడ్డి నిజామాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 9: ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ గాలిలో కలిసింది. అసెంబ్లీ సాక్షిగా విడుదల చేసిన జాబ్‌ ‌క్యాలెండర్‌ అభాసుపాలయ్యింది. రెండున్నరేండ్లు గడుస్తున్నా నోటిఫికేషన్లు ఎండమావిగా మారాయి అని…

వివాదాలకు నేను దూరం

– పార్టీ ప్రయోజనాలే ముఖ్యం – మీడియాతో వేం నరేందర్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 9: తాను వివాదాలకు దూరమని రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన వేం నరేందర్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు.  తెలంగాణ అసెంబ్లీ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నుంచి వేం నరేందర్‌ ‌రెడ్డి రాజ్యసభకు ఎన్నికైనట్లు ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు. అనంతరం…

మమ్మల్ని విశ్వసించండి.. ఆ భావజాలాన్ని వదలబోం

– మాజీ మావోయిస్టు తక్కెళ్ళపల్లి కాళోజి జంక్షన్/హన్మకొండ, ప్రజాతంత్ర, మార్చి 9 : ప్రజలు తమను విశ్వసించాలని పాత భావజాలంలోనే నిబద్ధతగా నిమగ్నతగా ప్రజల కోసం పని చేస్తామని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు తక్కెళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ రూపేష్ అన్నారు. హనుమకొండ మండలం బట్టుపల్లి గ్రామంలో ఓ ఫంక్షన్…

ఖ‌మ్మంలో మహిళా కానిస్టేబుల్ పై దాడి

– భూదాన్ భూముల నిర్వాసితుల‌తో క‌విత నిర‌స‌న‌ – బాధితుల‌కు అండ‌గా వుంటాన‌ని హామీ ఖమ్మం, ప్రజాతంత్ర, మార్చి 9 : భూదాన్‌ భూముల నిర్వాసితులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవిత నిరసన ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్తతకి దారి తీసింది. వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా నిరసన తెలిపేందుకు కవిత, డీఎస్‌పీ అధినేత…

రాష్ట్రం నుంచి ఇద్దరు రాజ్యసభకు ఏకగ్రీవం

– ధ్రువీకరణ పత్రాలు అందజేత హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 9: తెలంగాణ నుంచి నామినేషన్‌ ‌దాఖలు చేసిన ఇద్దరు అభ్యర్థులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఉపేందర్‌ ‌రెడ్డి సోమవారం ప్రకటించారు. కాంగ్రెస్‌ ‌పార్టీ తరఫున వేం నరేంద‌ర్ రెడ్డి, అభిషేక్‌ ‌మను సింఘ్వీలు రాజ్యసభకు ఎన్నికైనట్లు ఆయన తెలిపారు.…

విద్యుదాఘాతానికి ఇద్దరు బలి

మంచిర్యాల, ప్రజాతంత్ర, మార్చి 9: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మేదరిపేటలో విషాదం నెలకొంది. ఇండియన్ పెట్రోల్ బంకు వద్ద సోమవారం ఉదయం విద్యుత్ షాక్కు గురై ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెట్రోల్ బంక్ నుంచి ఎత్తైన ఇనుప స్టాండ్ ను తీసుకెళ్లే క్రమంలో మెయిన్ లైన్…

పరిశ్రమలకు అనుగుణంగా నైపుణ్యాలు

– మంత్రి వివేక్ వెంకటస్వామి – 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఐటీఐలలో ఆధునిక కోర్సులు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9: ప్రభుత్వం చేపట్టబోయే 99 రోజుల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా మల్లేపల్లి ప్రభుత్వ ఐటీఐలోని అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)లో నూతన స్వల్పకాలిక కోర్సులను కార్మిక, ఉపాధి, గనుల శాఖ…

అందరూ గర్వంగా చెప్పుకునేలా సిద్దిపేట అభివృద్ధి

– ఇఫ్తార్ విందులో హరీష్‌రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, మార్చి 9: సిద్ధిపేట అంటే గర్వంగా చెప్పుకునే విధంగా అభివృద్ధి చేసుకున్నాం.. మీ అందరి దీవెనలతో ఇలానే అభివృద్ధి చేసుకుందాం అని ఎమ్మెల్యే, శాసనసభలో బీఆరఎస్ ఉప నాయకుడు తన్నీరు హరీష్‌రావు అన్నారు. సిద్దిపేటలో సోమవారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.…