Day March 5, 2026

అర్ధరాత్రి అవస్థలకు ఇక చెక్

– గిరిజన బిడ్డల ప్రాణాలకు మంత్రి పొంగులేటి భరోసా – తిరుమలాయపాలెంలో ఏరియా హాస్పిటల్‌కు శంకుస్థాపన తిరుమలాయపాలెం, ప్రజాతంత్ర, మార్చి 5: అర్ధరాత్రి వేళ ఆపద వస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఖమ్మం పరుగు తీయాల్సిన కష్టాలు ఈ ప్రాంత గిరిజన బిడ్డలకు ఇక ఉండవు. పేదవాడి సొంత గడ్డపైనే కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించడమే…

మరో అంతర్జాతీయ ఈవెంట్‌కు హైదరాబాద్ ఆతిథ్యం

– 8నుంచి మహిళల వరల్డ్ కప్ హాకీ క్వాలిఫైయర్స్-2026 పోటీలు – ఏర్పాట్లు పూర్తయ్యాయన్న మంత్రి శ్రీహరి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 5: గ్లోబల్ సిటీగా గుర్తింపు పొందుతున్న హైదరాబాద్ మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ క్రీడా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వబోతోంది. మహిళల వరల్డ్ కప్ హాకీ క్వాలిఫైయర్స్ 2026 పోటీలు ఈనెల 8 నుంచి 14వ…

అమెరికా మరో దుస్సాహసం

– అణు వార్‌హెడ్‌ ‌క్షిపణి పరీక్ష నిర్వ‌హ‌ణ‌ వాషింగ్టన్‌,‌ మార్చి 5: పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నడుమ అమెరికా భారీ అణు సామర్థ్యం గల క్షిపణి పరీక్ష నిర్వహించడం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అమెరికా సైన్యం కాలిఫోర్నియా తీరంలో ఉన్న వాండెన్‌బర్గ్ ‌స్పేస్‌ ‌ఫోర్స్ ‌బేస్‌ ‌నుంచి శక్తిమంతమైన మినిట్‌మ్యాన్‌-3 ‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ…

ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ

– కడియం విచారణ పూర్తి – దానం విచారణ 7కు వాయిదా హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 5: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతోంది. గురువారం కడియం శ్రీహరిని స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌  ‌విచారించారు. కొన్ని గంటలపాటు సాగిన ఈ విచారణ ముగిసింది. మరో ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ‌విచారణ పూర్తి కాలేదు. ఆయన…

ఏసీబీకి చిక్కిన జీహెచ్‌ఎం‌సీ ఉద్యోగి

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 5: జీహెచ్‌ఎం‌సీ సికింద్రాబాద్‌ ‌జోనల్‌ ‌కార్యాలయంలో అకౌంట్‌ ‌సెక్షన్‌ ‌విభాగంలో ఎగ్జామినర్‌గా పనిచేస్తున్న సూర్య వంశీ సంతోష్‌ ‌లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సిటీ రేంజ్‌ 2 ఏసీబీ అధికారులు కార్యాలయంపై మెరుపు దాడి చేసి రూ.35 వేలు లంచం తీసుకున్న ఎగ్జామినర్‌ను పట్టుకున్నారు.రిటైర్‌మెంట్‌…

లిక్కర్‌ ‌కేసు కొట్టేయడంతో స్వామికి మొక్కు

– తిరుమలకు కాలినడకన చేరుకున్న కవిత – త్వరలోనే రాజకీయ పార్టీ ఏర్పాటు – తెలంగాణ ఫస్ట్ ‌నినాదంతో ముందుకు వెళతామని ప్రకటన తిరుపతి, మార్చి 5: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తిరుమలకు కాలినడకన వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకునేందుకు తిరుపతి చేరుకున్నారు. తిరుపతిలోని అలిపిరి వద్ద నుంచి కాలినడకన తిరుమల బయల్దేరిన ఆమె…

పార‌ద‌ర్శ‌క వ్య‌వ‌స్థ‌లే రోగుల భ‌ద్ర‌త‌కు కీల‌కం

– బ‌యోమెడిక‌ల్ వ్య‌ర్థాల‌పై చ‌ర్చ‌ – ‘కేర్’ లో  ‘ప్రవర 2026’–కేర్ గవర్నెన్స్ & కంప్లయన్స్ స‌ద‌స్సు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 5: రోగులకు సురక్షితమైన వైద్యం అందించడంలో చట్టపరమైన నిబంధనలు, పారదర్శక వ్యవస్థలు ఎంత ముఖ్యమో తెలియజేయడానికి కేర్ హాస్పిటల్స్ ‘ప్రవర 2026’ –కేర్ గవర్నెన్స్ & కంప్లయన్స్ సమ్మిట్ 2.0 (సీజీజీఎస్) పేరుతో…

రాష్ట్రంలో వాతావరణ మార్పులు

– మూడో వారంలో పిడుగులతో కూడిన వర్షాలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 5: రాష్ట్రంలో ఈ నెల చివరలో అకాల వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెదర్‌ ‌మ్యాన్‌ ‌వెల్లడించారు.  18, 19 తర్వాత ఉరుములు మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. అయితే అప్పటివరకు ఎండలు ఇదేస్థాయిలో కొనసాగుతాయని వెదర్‌ ‌మ్యాన్‌…

ఖమేనీ మృతికి భారత్‌ ‌సంతాపం

– రాయబార కార్యాలయంలో విక్రమ్‌ ‌మిస్రీ సంతాపం న్యూదిల్లీ, మార్చి 5: ఇరాన్‌ ‌సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ మృతికి భారత్‌  ‌సంతాపం తెలిపింది. ఈ మేరకు దిల్లీలోని ఇరాన్‌ ‌రాయబార కార్యాలయానికి వెళ్లిన భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ ‌మిస్రీ భారత్‌ ‌తరఫున సంతాప సందేశాన్ని రాశారు. అనంతరం ఇరాన్‌ ‌రాయబారితో మిస్రీ…