Day February 7, 2026

చరిత్ర: వర్తమాన వైఫల్యాలకు రక్షణకవచమా ..?

“చరిత్ర మన వర్తమాన, భవిష్యత్ తరాలకు మార్గదర్శిగా ఉండాలి, అంతేకానీ చీకటిలో మనం తడబడిన ప్రతిసారీ నిందించే దెయ్యంలా ఉండకూడదు. స్వతంత్ర భారతదేశ  పోరాట యోధులు ఇప్పటికే వారి చరిత్రను రాసేశారు, అది మంచిదైనా చెడ్డదైనా వారి కలం సిరా ఎప్పుడో ఇంకిపోయింది. నేటి నాయకత్వం ఆ పాత పేజీలను చెరిపేయడం పైనే ఎందుకు అంతగా…

రాష్ట్రంలో దూషణ రాజకీయాలు!!

ఇటీవలి కాలంలో తెలంగాణ రాజకీయాల్లో విచ్చలవిడిగా అన్‌పార్లమెంటరీ భాషను ప్రయోగించడం బాగా కనిపిస్తోంది. ఇంత దారుణంగా వ్యక్తి గత దుర్భాషలకు దిగడం చూస్తుంటే ఇక ముందు తెలంగాణ రాజకీయాలు ఇంకెంత దారుణంగా మారుతాయోనన్న భయం వేస్తోంది. ముఖ్యంగా బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న రేవంత్‌రెడ్డి ఎన్నికల ర్యాలీలు, బహిరంగసభల్లో తరచుగా సహనాన్ని కోల్పోతూ అనాగరిక భాషను…

లడఖ్ భవిష్యత్తును దిల్లీ నుంచి నిర్ణయించలేరా ?

“లడఖ్ అనుభవం ఒంటరిది కాదు. కాశ్మీర్, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, అస్సాం వంటి భారత సరిహద్దు ప్రాంతా లన్నింటినీ ఇదే నమూనా కనిపిస్తుంది. జాతీయ ఏకత్వం పేరుతో ప్రత్యేక రక్షణలు తొలగించబడుతున్నాయి. స్థానిక నాయకత్వాన్ని అప్రామాణికం చేస్తున్నారు. నిరసనలను అస్థిరత గా, తీవ్రవాదంగా చిత్రీకరిస్తున్నారు. సైనికీకరణ ద్వారా గనులు, పరిశ్రమలకు మార్గం సుగమం చేస్తున్నారు.”  2019లో…

కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌ను గెలిపించాలి

– మంత్రి సీతక్క పిలుపు ఇబ్రహీంపట్నం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7: మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా జీహెచఎంసీ పరిధిలోని బహీంపట్నం మున్సిపాలిటీ బరిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల తరపున శనివారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పాల్గొని కాంగ్రెస్…

రేవంత్‌ది ద్రోహ చ‌రిత్ర‌

-కేసీఆర్ మ‌నోడు..రేవంత్ మందోడు -ఏపీకి నీళ్లు తాక‌ట్టు పెడుతున్న ద్రోహం -పాల‌మూరులో మిగిలిన ప‌నులు చేయ‌లేదు -ప‌రిగిలో రేవంత్ వ్యాఖ‌ల‌పై హ‌రీష్‌రావు ఆగ్ర‌హం సంగారెడ్డి, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 7: ఎన్నికల సభల్లో ఎవరైనా ఏం మాట్లాడుతారు? రెండున్నరేళ్లలో ఇవి చేసినం, భవిష్యత్తులో ఇవి చేస్తం అని చెబుతుంటారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నడు.…

తెలంగాణ‌కు బీజేపీ తీర‌ని అన్యాయం

– పున‌ర్విభ‌జ‌న చ‌ట్టాల‌ను అమ‌లు చేయ‌లేదు – కాంగ్రెస్ వ‌చ్చాకే సంక్షేమ కార్య‌క్ర‌మాల అమ‌లు – కేంద్రంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజం నిజామాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, పిబ్ర‌వ‌రి 7: రాష్ట్రానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బి.జే.పి తీరని అన్యాయం చేసిందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు.…

ప్రకృతి వ్యవసాయాన్ని ఉద్యమంలా చేపట్టాలి

– ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం ఆమనగల్లు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : రైతులు ప్రస్తుత పరిస్థితులలో ప్రకృతి వ్యవసాయాన్ని ఉద్యమంలా చేపట్టి వ్యవసాయాన్ని పూర్వస్థితికి తీసుకురావాలని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలోని అన్మాస్ పల్లి గ్రామ సమీపంలో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సి జి ఆర్ భారత్ బీచ్…

బీసీ ద్రోహులెవరు..?..బాధితులెవ్వరు..?

“హక్కులపై అధికార పక్షాలను ప్రశ్నించి, నిలదీసినప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది. అంతేకానీ పాలకవర్గాల భ్రమల్లో ఉంటై ప్రతిపక్షాలను ప్రశ్నిస్తే ప్రయోజనం శూన్యం, వెరసి బీసీలను మరింత అన్యాయం జరుగుతుందన్నది గ్రహించాలి. సోకాల్డ్ బీసీ నేతల ప్రచారం వెనుక,ప్రకటనల వెనుక ఖచ్చింతగా బీసీ ప్రయోజనాలైతే లేవు..ఎవరి ప్రయోజనాలున్నాయో బీసీలు తెలుసుకోవాలి. బీఆర్ఎస్‌ను టార్గెట్‌ చేస్తున్న కొంతమంది బీసీ…

 ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్

– డిగ్రీ పట్టాతో పాటే కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగ హామీ – టీసీఎస్ఈ సంయుక్తంగా ప్రత్యేక కోర్సు ప్రారంభం హైదరాబాద్, ప్రజాంత్ర, ఫిబ్రవరి 7: డిగ్రీ పూర్తయిన వెంటనే ఉద్యోగం సంపాధించడం ప్రతి విద్యార్థి కల. ఆ కలను సాకారం చేస్తూ డా.బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్తో కలిసి…