తాండూరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 20: 2024 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు ఓటర్గా నమోదు చేసుకోవాలని బి ఎల్ ఓ ల శిక్షణ కార్యక్రమంలో అధికారులు సూచించారు. బుధవారం ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు జరుగుతున్న బిఎల్వోల శిక్షణ కార్యక్రమంలో భాగంగా మంగళవారం బుధవారం తాండూరు మండల బూత్ లెవల్ అధికారుల శిక్షణ కార్యక్రమం పట్టణంలోని ప్రభుత్వ నెంబర్ వన్ పాఠశాలల్లో అధికారులు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1 జనవరి 2024 నాటికి 18 సంవత్సరాల నుండి యువతీ యువకులు నూతన ఓటరుగా నమోదు చేసుకోవాలి. అందుకు గాను ఫారం-6 లో సంబంధిత బూత్ లెవల్ అధికారి దగ్గర లేదా ఆన్లైన్లో జనవరి 5 లోగా దరఖాస్తు సమర్పించాలి . చనిపోయిన మరియు డబుల్ ఓటర్లు ఉన్నవారు వారి కుటుంబ సభ్యుల చేత ఫారం – 7 యందు దరఖాస్తు తీసుకుని అట్టి ఓట్లను తొలగించాలి . ఓటర్ లిస్టులో మార్పులు, చేర్పులకు గాను ఫారం-8 నందు దరఖాస్తు సమర్పించాలి . ఓటర్ లిస్టు ప్రక్షాళన చేయవలసిన బాధ్యత బి.ఎల్. ఓ లదే . నిర్లక్ష్యం వహించే బూత్ లెవల్ అధికారులపై తగు చర్యలు తీసుకోబడును అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్లు ముసావీర్ , మృత్యుంజయ స్వామి, గిర్ధావర్ లు బాలరాజ్, రాజు రెడ్డి, బిఎల్ ఓ సూపర్వైజర్లు పాల్గొన్నారు.
2024 జనవరి 1నాటికి 18 సం లు నిండే యువతీ యువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలి



