20 కోట్ల పెండింగ్ క్యాంటీన్‌ బిల్లులను చెల్లించాలి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 31 : ప్రభుత్వ హాస్పిటళ్లను కాంగ్రెస్‌ నిర్లక్ష్యం చేస్తుందని మాజీ మంత్రి హరీష్‌ రావు విమర్శించారు. హాస్పిటల్‌ క్యాంటీన్లకు బిల్లులను చెల్లించకుండా పెండిరగ్‌లో ఉంచిందని తెలిపారు. రూ.20 కోట్ల బిల్లులు చెల్లించకపోవడంతో రోగులు, వైద్యులు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణలోని ప్రభుత్వ దవాఖానాల్లో రోగులు, డ్యూటీ డాక్టర్లకు ఆహారం సరఫరా చేస్తున్న డైట్‌ క్యాంటీన్లకు రాష్ట్ర ప్రభుత్వం కొద్ది రోజులుగా బిల్లులు చెల్లించడం లేదని, దాంతో డైట్‌ క్యాంటీన్‌ సప్లై చేస్తున్న వారి బకాయిలు రూ.20 కోట్లకు చేరుకున్నాయన్నారు.

కొంతకాలంగా బిల్లులు రాకపోవడంతో పాటు సరుకుల ధరలు పెరగడంతో క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేయడం తమకు ఇబ్బంది కలుగుతుందని గాంధీ, ఉస్మానియా, పెట్లబుర్జు, సంగారెడ్డి, వరంగల్‌ ఎంజీఎం హాస్పిటళ్లకు ఆహారం సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారన్నారు. దీనిపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర  రాజనర్సింహా, డీఎంఈ డాక్టర్‌ ఎన్‌.వాణి, వైద్య శాఖ కమిషనర్‌ను గురువారం కలిసి వినతి పత్రాలు అందజేసిన క్రమంలోనే హరీశ్‌రావు ట్విట్టర్‌ (ఎక్స్‌ ) వేదికగా స్పందిస్తూ…రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండిరగ్‌ బిల్లులను చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు క్యాంటీన్‌ కాంట్రాక్టర్లు పడుతున్న ఇబ్బందులకు సంబంధించి టైమ్స్‌ న్యూస్‌ నెట్‌వర్క్‌లో ప్రచురితమైన ఒక వార్తకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ఆయన షేర్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *