– రైతుల కోసం రూ.2 కోట్ల చెక్ అందజేసిన ఎమ్మెల్యే
– ఆ సొమ్ముతో ఒక్కో బస్తా యూరియా ఉచితంగా అందించండి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18: రైతులకు సహాయ పడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి రూ.2 కోట్ల చెక్ అందజేసి తన ఉదారతను చాటుకున్నారు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, కుటుంబ సభ్యులు. తన నియోజకవర్గంలోని రైతుల కోసం ఈ సొమ్ముమ వెచ్చించాలని విజ్ఞప్తి చేశారు. అదనులో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున తను విరాళంగా ఇచ్చిన సొమ్ముతో లక్ష మంది రైతులకు ఒక్కో యూరియా బస్తా ఉచితంగా అందజేయాలని సీఎంను కోరారు. ఎంఎల్‌ఏ కుమారుడు సాయి ప్రసన్న వివాహం ఇటీవల జరగగా మిర్యాలగూడలో భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేయాలని భావించారు. అయితే రైతుల గురించి ఆలోచించిన ఆయన కుటుంబ సభ్యులు రిసెప్షన్‌ను రద్దు చేసుకుని ఆ డబ్బును రైతుల కోసం ఖర్చు చేసేందుకు ముందుకొచ్చారు. రైతులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన లక్ష్మారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





