నిన్న ఒక్కరోజే 2.36 లక్షల సిలిండర్ల డెలివరీ

– రోజువారీ సగటును మించి సిలిండర్ల డెలివరీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 18: రాష్ట్రంలో ఎల్‌పీజీ సిలిండర్లకు కొరత లేదని పౌర సరఫరాల సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో మంగళవారం ఒక్క రోజే 2 లక్షల 35 వేల 678 సిలిండర్లను డెలివరీ చేసినట్లు ప్రకటించింది. సిలిండర్లు రీఫిల్´ కోసం ఆందోళన చెందవద్దని వినియోగదారులకు ప్రభుత్వం సూచించింది. సిలిండర్ల డెలివరీలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పర్యవేక్షించేందుకు పౌర సరఫరాల సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్‌లో అధికారులతోపాటు ఎల్‌పీజీ సిలిండర్లు సరఫరా చేసే ఆయిల్ కంపెనీలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ కంపెనీల ప్రతినిధులు ఉన్నారు. ఈ మూడు కంపెనీలు కలిపి సగటున రోజుకు 2,15,151 సిలిండర్లు డెలివరీ చేసేవి. మంగళవారం అంతకుమించి డెలివరీ అయ్యాయి నిన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుండి 93,887(+G1%) సిలిండర్లు, హెచ్‌పీసీఎల్ నుండి 84,156 (_11,98%) సిలిండర్లు, బీపీసీఎల్ నుండి 57,635 (+22.63%) సిలిండర్లు మొత్తం 2,35,678 సిలిండర్లు పంపిణీ అయ్యాయని పౌరసరఫరాల సంస్థ తెలిపింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *