హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 01 : అణచివేత, అవమానాలు, నిరాధారణకు గురైన తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిపెట్టిన సిఎం కెసిఆర్ నేతృత్వంలోని బిఆర్ఎస్ పార్టీకి ప్రజాసైన్యం పార్టీ, తమ అనుబంధ సంఘాల సంపూర్ణ మద్దతు ఉంటుందని జాతీయ అధ్యక్షులు వేములవాడ రాజ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం పార్టీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేద రైతులకు ఋణమాఫీ, రైతు బంధు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు, వృద్ధులకు ఇస్తున్న పెన్షన్ పెంచడమే కాకుండా దళిత బంధు, బీసీ బంధు, సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టి, పక్కనే 125 అడుగుల బాబాసాహెబ్ విగ్రహం ఏర్పాటు చేసిన గొప్ప నాయకులు కెసిఆర్ అని కొనియాడారు. వివిధ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ మారుమూల గ్రామాల్లోకి సాగు, త్రాగు నీటిని అందిస్తున్న అపర భగీరధుడు కెసిఆర్ అన్నారు. 119 నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ పార్టీ గెలుపుకు తమ పార్టీ శ్రేణులు, విభాగాలు నిర్విరామంగా శ్రమిస్తాయన్నారు. ఉప్పల్ లో బండారు లక్ష్మారెడ్డి గెలుపు కృషి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ ఉప్పల్ ఇంచార్జి టి.ప్రసాద్, పోలోజు రామచంద్రయ్య, భానుచందర్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
19 నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు



