19 ‌వేల కోట్ల రూపాయల రైతుల రుణమాఫీ..!

  • నేటి  నుండి పున:ప్రారంభం..ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు అధికారులకు ఆదేశాలు
  • ట్ల రద్దు, కొరోనా తదితర కారణాలతో ఇన్నాల్లు ఆలస్యం
  • రైతాంగ సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్న సిఎం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 2 : ‌రాష్ట్ర రైతాంగ సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. ఎన్నికష్టాలొచ్చినా రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి వుంటామని సిఎం కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు. రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని నేటి నుంచి పున:ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు నిర్ణయించారు. ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 3వ తేదీనుంచి పున:ప్రారంభించాలని ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ ‌రావును,  కార్యదర్శి రామకృష్ణారావును సిఎం ఆదేశించారు. రైతుబంధు తరహాలో విడతల వారీగా కొనసాగిస్తూ నెలపదిహేను రోజుల్లో, సెప్టెంబర్‌ ‌రెండో వారం వరకు, రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తిచేయాలని సిఎం కేసీఆర్‌ ‌స్పష్టమైన ఆదేశాలిచ్చారు. కేంద్రం తీసుకున్న నోట్లరద్దు నిర్ణయం వల్ల ఏర్పడిన మందగమనం, కొరోనా వల్ల సంభవించిన ఆర్థిక సమస్యలు, ఎఫ్‌ఆర్బీఎమ్‌ ‌నిధులను విడుదల చేయకుండా కేంద్రం, తెలంగాణ పట్ల అనుసరించిన కక్షపూరిత చర్యలు..

తదితర కారణాల వల్ల  ఆర్థికలోటుతో ఇన్నాల్లు కొంత ఆలస్యమైందని సిఎం కేసీఆర్‌ ‌తెలిపారు. తిరిగి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుకున్న నేపథ్యంలో, రాష్ట్రంలో రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని పున:ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రగతి భవన్‌లో బుధవారం నాడు సిఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్షా• సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…రైతులకు అందిచాల్సిన రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్‌ ‌సాగునీరు వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో నిరాఘాటంగా కొనసాగిస్తున్నామని, తాము ఇప్పటికే చెప్పినట్టు ఎన్ని కష్టాలు, నష్టాలు వొచ్చినా..ఆరునూరయినా రైతుల సంక్షేమాన్ని, వ్యవసాయాభివృద్ధి కార్యాచరణను విస్మరించే ప్రసక్తేలేదని కెసిఆర్‌ ఈ ‌సందర్భంగా స్పష్టం చేశారు.

పైగా వ్యవసాయాభివృద్ధి కోసం ఫుడ్‌ ‌ప్రాసెసింగ్‌ ‌యూనిట్స్ ఏర్పాటు వంటి ఆదర్శవంతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నామని, తద్వారా రైతు సాధికారత సాధించే వరకు వారిని ఆర్థికంగా ఉన్నతంగా తీర్చిదిద్దే వరకు విశ్రమించే ప్రసక్తేలేదని అన్నారు. ఇప్పటికే అందించిన రుణమాఫీ పోను మరో 19 వేల కోట్ల రూపాయల రుణమాఫీని రైతులకు అందించాల్సి వుందని సిఎం తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు, సిఎం ముఖ్య సలహాదారు సోమేశ్‌ ‌కుమార్‌, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హెచ్‌ఎం‌డీఎ ప్రిన్సిపల్‌ ‌సెక్రటరీ అర్వింద్‌ ‌కుమార్‌, ‌వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌ ‌రావు  పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *