18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు ఓటు హక్కు : ఫరూక్ నగర్ తహాసిల్దార్ గోపాల్

షాద్ నగర్ ప్రజా తంత్ర జూలై 22: ఫరూక్ నగర్ మండలం వ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం ప్రారంభమైందనీ ఇదొక నిరంతర ప్రక్రియ అనీ ఫరూక్ నగర్ తహాసిల్దార్ గోపాల్ అన్నారు. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాల కొసం శనివారం రెవెన్యూ సిబ్బంది బూత్ లెవల్ ఆఫీసర్స్ కి సూచనలిచ్చారు. మండల యంత్రాంగం పరిశీలన కార్యక్రమాలను చేపట్టిందని తాసిల్దార్ గోపాల్ మీడియాకు తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం ప్రారంభమైందనీ బూత్‌ లెవల్‌ అధికారులు ఇంటింటికి తిరిగి ఓటర్ల జాబితాను సర్వే చేయాలని ఎన్నికల కమిషనర్‌ మార్గదర్శకాలు జారీచేయడంతో అందుకు అనుగుణంగా మండల వ్యాప్తంగా ఈ ప్రక్రియను చేపట్టారనీ తెలిపారు. ప్రతి ఓటును బీఎల్వోలు ఇంటింటికీ తిరిగి సర్వే చేస్తున్నారనీ చనిపోయిన వారి ఓట్లు, దొంగ ఓట్లు, డూప్లికేట్‌ ఓట్లను తొలగించడంతోపాటు వచ్చే ఎన్నికల నాటికి 18 ఏళ్లు నిండే ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించే విధంగా చర్యలు చేపట్టమన్నారు. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాలపై అధికారి ఆనంద్ సింగ్ సూచనలు జారీ చేశారు. మండలంలో ఇప్పటివరకు 85,882 ఓట్లు నమోదు ఉన్నాయని తాసిల్దార్ గోపాల్ తెలిపారు. మండలంలో పట్టణ కేంద్రంలో 41 మంది బూత్ లెవెల్ ఆఫీసర్లు ఉండగా మండల రూరల్ స్థాయిలో 98 మంది బూత్ లెవెల్ ఆఫీసర్లు ఉన్నట్టు తాసిల్దార్ గోపాల్ మీడియాకు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *