- కాంగ్రెస్ అధికారంలోకిరాగానే ప్రత్యేక హోదా
- కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్
కర్నూలు, అక్టోబరు 4 : రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో యాత్ర తమిళనాడు, కేరళ రాష్టాల్ల్రో పూర్తయిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి జైరాం రమేష్ అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ డియాతో మాట్లాడుతూ ఈనెల 18న కర్నూలు జిల్లా, ఆలూరు ప్రాంతంలో రాహుల్ పాదయాత్ర ఉంటుందని, 4 రోజులు పాటు 85 కి.. సాగుతుందన్నారు.
రాహుల్ గాంధీ ప్రధాని అయితే తొలి సంతకం ప్రత్యేక హోదా ఫైల్ పైనే అని స్పష్టం చేశారు. టిఆర్‌ఎస్.. బీఆర్‌ఎస్ కాదని, టిఆర్‌ఎస్ విఆర్‌ఎస్ తప్పదని జైరాం రమేష్ జోస్యం చెప్పారు. జోడో యాత్రపై బీజేపీ, మిత్రపక్షాలు విషం చిమ్ముతున్నాయని జైరాం రమేష్ మండిపడ్డారు. తెలుగులో భారత్ జోడో థీమ్ పాట 18న విడుదల చేస్తామన్నారు. ఆర్థిక అసమానత పెరగడం, కుల, మత, బాషా, సామాజిక విభజన, రాజకీయ కేంద్రీకృతం..వీటికి వ్యతిరేకంగా భారత్ జోడో యాత్ర కొనసాగుతుందన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ భారత్ జోడో యాత్రలో ప్రజల స్పందనను చూసి భయపడుతున్నారన్నారు. కాంగ్రెస్‌కు భారత్ జోడో యాత్ర సంజీవిని అని జైరాం రమేష్ వ్యాఖ్యానించారు.



