- ఆరు రోజులపాటు ఎన్నికల ప్రచారం
- ప్రతీ నియోజకవర్గంలో అగ్రనేతల పర్యటనలు ఉండేలా కాంగ్రెస్ కసరత్తు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 13 : కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఆరు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఆయన టూర్ ఖరారైనట్లు తెలుస్తుంది. 17వ తేదీన తెలంగాణకు రానున్న రాహుల్.. 23 దాకా ఇక్కడే ఉండనున్నట్లు సమాచారం.
17న పాలకుర్తి, వరంగల్, భువనగిరిలో కాంగ్రెస్ నిర్వహించే సభల్లో రాహుల్ గాంధీ పాల్గొంటారు. అక్కడి నుంచి వరుసగా ఆరు రోజుల పాటు ఆయన వరుసగా సభల్లో పాల్గొననున్నారు. ఇక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రతీ నియోజకవర్గంలోనూ పార్టీకి చెందిన అగ్రనేతల పర్యటనలు ఉండేలా కాంగ్రెస్ కసరత్తులు చేస్తుంది. ఈ క్రమంలోనే ఒకే రోజు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సమావేశాలు ఉండేలా ప్లాన్ చేస్తుంది.





