17‌న విమోచనోత్సవ వేడుకలకు అమిత్‌ ‌షా

16న హైదరాబాద్‌కు కేంద్ర హోమ్‌ ‌మంత్రి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 14 : ‌సెప్టెంబర్‌ 17 ‌తెలంగాణ విమోచన వజ్రోత్సవ వేడుకలకు కేంద్రహోమ్‌ ‌మంత్రి అమిత్‌ ‌షా హాజరుకానున్నారు. ఈనెల 16, 17 తేదీల్లో అమిత్‌ ‌షా హైదరాబాద్‌ ‌పర్యటించనున్నారు. 16న అమిత్‌ ‌షా హైదరాబాద్‌కు చేరుకుంటారు. 17న ఉదయం 8 గంటలకు పరేడ్‌ ‌గ్రౌండ్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఇందుకోసం రాష్ట్ర బీజేపీ నేతలు భారీ ఎత్తున జనసవి•కరణ చేస్తున్నారు.

కాగా 16వ తేదీ సాయంత్రం కృష్ణంరాజు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఈ సందర్భంగా నటుడు ప్రభాష్‌తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఇటీవల మునుగోడు పర్యటన సందర్భంగా హైదరాబాద్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌తో అమిత్‌ ‌షా ప్రత్యేకంగా భేటీ అయిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *