154 ‌మంది సైబరాబాద్‌ ‌పోలీసులకు సేవాపతకాలు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర ,జనవరి 25: ఉత్తమ ప్రతిభ కనబర్చిన 154 మంది సైబరాబాద్‌  ‌పోలీసు అధికారులకు సేవా పతకాలను అందజేసారు. విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పోలీసు అధికారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సేవా పతకాలను ప్రకటించింది. దీనికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించే గ్యాలంటరీ అవార్డుల మాదిరిగా అత్యుత్తమ సేవలందించే పోలీస్‌ అధికారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం గత కొన్నేళ్లుగా ఈ అవార్డులను అందిస్తూ వస్తుంది. అయితే 2015-2022 సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ అవార్డులలో సైబరాబాద్‌ ‌కషనరేట్‌ ‌నుంచి 74 మందికి సేవా పతకాలు, 34 మందికి అతి ఉత్క•ష్ట పతకాలు, 46 మందికి ఉత్క•ష్ట పతకాలను ప్రభుత్వం ప్రకటించింది.

ఈ సందర్భంగా సైబరాబాద్‌ ‌పోలీసు కషనర్‌  ‌స్టీఫెన్‌ ‌రవీంద్ర ఉత్తమ సేవా పతకం,  అతి ఉత్క•ష్ట పతకం, ఉత్క•ష్ట పతకలకు గాను ఎంపికైన పోలీస్‌ అధికారులను అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా సిపి స్టీఫెన్‌ ‌రవీంద్ర మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు గాను సైబరాబాద్‌ ‌పోలీసులు మెడల్స్ అం‌దుకోవడం గర్వంగా ఉందన్నారు. కుటుంబ సభ్యులను, పండుగలను పబ్బాలను వదులుకొని రాత్రి పగలు  కష్టపడి పనిచేసి మెడల్స్ ‌సాధించినందుకుగాను తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీసు తరుపున అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ ‌సీపీ అవినాష్‌ ‌మహంతి, ట్రాఫిక్‌ ‌జాయింట్‌ ‌సీపీ నారాయణ్‌ ‌నాయక్‌,  ‌ట్రాఫిక్‌ ‌డిసిపి  టి. శ్రీనివాస్‌ ‌రావు, సిఏఆర్‌ ఎడిసిపి రియాజ్‌,  ఏసిపిలు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *