ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 12 : ఆమనగల్ పట్టణంలో ని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లో ఈనెల 15 నుంచి 25వ తేదీ వరకు 11 రోజులపాటు నిర్వహించే దసరా శరన్నవరాత్రోత్స వాల కోసం ఆలయాన్ని ముస్తాబు చేసినట్లు ఆలయ అధ్యక్షుడు వీరబొమ్మ రామ్మోహన్, ప్రధాన కార్యదర్శి బికుమండ్ల నరసింహ, కోశాధికారి బికుమండ్ల శ్రీనివాస్ తెలిపారు. ఆలయ కార్యక్రమం వివరాలను వారు వివరించారు. 15 న శ్రీ బాల త్రిపుర సుందరి దేవి, 16న శ్రీ శాఖాంబరి దేవి, 17న శ్రీ గాయత్రీ దేవి, 18న శ్రీ ధనలక్ష్మి దేవి, 19న శ్రీ అన్నపూర్ణాదేవి, 20న శ్రీ సరస్వతీ దేవి 21న శ్రీ లలితా దేవి 22న శ్రీ దుర్గాదేవి 23న శ్రీ మహిషాసుర మర్దిని దేవి 24న శ్రీ రాజరాజేశ్వరి దేవి 25న శ్రీ దుర్గాదేవి ఉద్వాసన ఊరేగింపుతో కార్యక్రమం ముగుస్తుందని నిర్వాహకులు తెలిపారు. సమయానుగుణంగా మండల ఆర్యవైశ్య సంఘం, యువజన సంఘం, వాసవి క్లబ్, వాసవి వనిత క్లబ్, వాసవి సీనియర్ సిటిజెన్ క్లబ్, ఆర్యవైశ్య మహిళా మండలిల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. కాగా శరన్నవరాత్రోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని రామ్మోహన్, నరసింహ, శ్రీనివాసులు కోరారు.
15 నుంచి ఆమనగల్లు కన్యకా పరమేశ్వరి దేవాలయం లో దసరా శరన్నవరాత్రోత్సవాలు




