- కోతలు లేని విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
- వృద్ధులు వికలాంగులు వితంతువులకు ఆత్మగౌరాన్ని పెంచిన ఘనత కేసిఆర్ దే
- ఆడబిడ్డ ఉన్న ప్రతి తల్లికి కేసీఆర్ కొండంత అండ
- 12 లక్షల 74 వేల పెళ్లిలకు కేసీఆర్ సహాయం
- ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే విధంగా బిఆర్ఎస్ మేనిఫెస్టో
- ప్రజల తీర్పును శిరసావాహిస్తాం
- ఆర్థిక ఆరోగ్య శాఖ మాత్యులు తన్నీరు హరీష్ రావు..
రామన్నపేట,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29 : రామన్నపేట ప్రభుత్వ హాస్పిటల్ 15 కోట్లతో అభివృద్ధి చేసి అందుబాటులోకి తెస్తామని ఆర్థిక ఆరోగ్య శాఖ మాత్యులు తన్నీరు హరీష్ రావు అన్నారు. శుక్రవారం స్థానిక రామన్నపేట 50 పడకల ప్రభుత్వ హాస్పిటల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2.5 కోట్లతో చేపట్టనున్న చెన్నకేశవ ఆలయం నిర్మాణం ఎస్టీఓ కార్యాలయాలను ప్రారంభించారు. అనంతరం జూనియర్ కళాశాల ఆవరణ ఏర్పాటుచేసిన సభ ప్రాంగణంలో ప్రజల ఉద్దేశించి మాట్లాడారు. కోతలు లేకుండా విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, ఇంటింటికి తాగునీరు అందించిన జనత కేసిఆర్దేనని అన్నారు. వృద్ధులు వికలాంగులు వితంతువుల ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత కేసిఆర్ కి దక్కుతుందని అన్నారు. ఆడబిడ్డ ఉన్న ప్రతి తల్లికి కల్యాణ లక్ష్మి పేరిట కేసీఆర్ రాష్ట్రంలో 12 లక్షల 74 వేల పెళ్లిళ్లకు సహాయం అందించారని అన్నారు.
నాలుగు లక్షల మందికి మాట ప్రకారం రెండువేల పెన్షన్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.మహిళలు యువత కుల వృత్తుల బలపటానికి కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. ప్రతిపక్షాలకు దిన్నతిరిగేలా టిఆర్ఎస్ మేనిఫెస్టో త్వరలో ప్రజలకు అందుబాటులో ఉంటుందని అన్నారు. సంక్షేమ పథకాలకు స్వర్ణ యుగం కెసిఆర్ హయాంలో సాగుతుందని అన్నారు. ప్రజల్లో ఎంత చర్చ జరుగుతే అంత మంచిదని ప్రజల తీర్పును ఎప్పుడు శిరసావహిస్తామని అన్నారు. రాష్ట్రంలో కెసిఆర్ సర్కారుకు ప్రజలు వెన్నుదన్నుగా ఉన్నారని అన్నారు తెలంగాణలో టిఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇంటింటికి తాగునీరు అందించిన ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ మాత్యులు గుంతకండ్ల జగదీశ్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, పైల శేఖర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, ఆయిల్ పట్టు చైర్మన్ రామకృష్ణారెడ్డి, ఫైళ్ల రాజగోవర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.




