ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 6 : ఆమనగల్లు మున్సిపాలిటీ 15వార్డు లోని శివాలయం కాలనీ, ప్రతిభనగర్ కాలని, ఉదయ్ నగర్ కాలనీ వెళ్లే మార్గంలో సీసీ రోడ్డు పనులను కౌన్సిలర్ చెక్కల లక్ష్మణ్ తో కలిసి చైర్మన్ రాంపాల్ నాయక్ జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి ప్రారంభించారు. రూ. 60 లక్షలతో సుమారు 500మీటర్ల వరకు చేపట్టుతున్నసీసీ వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆచారి మాట్లాడుతూ సీసీ పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ దుర్గయ్య, నాయకులు గోరటి నర్సింహా, ఆరుకలి కృష్ణయ్య, యాదయ్య, నర్సింహా, రమేష్, యాదగిరి, వడ్డే రాజు, నాగిళ్ల లక్ష్మణ్, రవి, శ్రీను, కృష్ణయ్య, రాములు, వెంకటేష్, సాయి కాలనీవాసులు మహిళలు పాల్గొన్నారు.
15వ వార్డులో సిసి రోడ్డు పనులు ప్రారంభం





