14 కోట్ల రూపాయలతో గుమ్మడిదల గ్రామ సమగ్ర అభివృద్ధి

ఒకే రోజు 5 కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల ప్రారంభం
జివిఆర్ ఎంటర్ప్రైజెస్ సౌజన్యంతో కోటి 25 లక్షల రూపాయలతో సిసి రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన
కుల సంఘాల భవనాల నిర్మాణాలకు 30 లక్షల రూపాయల సొంత నిధులు అందజేత
త్వరలోనే నిరుపేదలకు 75 గజాల ఇళ్ల స్థలాల పంపిణీ
పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25: మండల కేంద్రమైన గుమ్మడిదల గ్రామాన్ని 14 కోట్ల రూపాయలతో సమగ్ర అభివృద్ధి చేయడంతో పాటు, కుల సంఘాల ఆత్మగౌరవ భవనాలకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం అందించే నిధులతోపాటు సిఎస్ఆర్ నిధులతో శరవేగంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని తెలిపారు. గత పది సంవత్సరాల కాలంలో చేపట్టిన అభివృద్ధిని ప్రజలు గమనించాలని కోరారు.మండల కేంద్రమైన గుమ్మడిదలలో కోటి రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన బ్రాహ్మణ సంఘం, విశ్వకర్మ సంఘం, నాయి బ్రాహ్మణ సంఘం, యాదవ సంఘం,  మాల సంఘం ఆత్మగౌరవ భవనాలను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సోమవారం పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. జివిఆర్ ఎంటర్ప్రైజెస్ సంస్థ సౌజన్యంతో కోటి 25 లక్షల రూపాయలు,  హానర్ ల్యాబ్ సంస్థ సౌజన్యంతో 15 లక్షల రూపాయలతో నిర్మించ తలపెట్టిన సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన గ్రామీణ ప్రాంతాలను నేడు అభివృద్ధికి ప్రతీకలుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ గుమ్మడిదల గ్రామం అన్నారు. గత పది సంవత్సరాల కాలంలో 14 కోట్ల రూపాయలతో సమగ్ర అభివృద్ధి చేపట్టామని తెలిపారు. ప్రతి గల్లీలో సిసి రోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువలు, మిషన్ భగీరథ నల్ల కనెక్షన్లు, ఎల్ఈడి వీధి దీపాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తూ వారి అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తున్నట్లు తెలిపారు.ప్రభుత్వం అందించే నిధులతోపాటు జీవీఆర్ ఎంటర్ప్రైజెస్ సౌజన్యంతో కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. కుల సంఘాల ఆత్మగౌరభవన నిర్మాణాలకు 30 లక్షల రూపాయల సొంత నిధులు అందించినట్లు తెలిపారు.గ్రామాలలో సుంతింటి కలని సహకారం చేసేందుకు నిరుపేదలకు 75 గజాల ఇళ్లస్థలం అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని వారికి గృహలక్ష్మి పథకం ద్వారా మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తోందని.  రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా పూర్తి పారదర్శకతతో లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని, పథకాల లబ్దికోసం దళారులను ఆశ్రయించ వద్దని విజ్ఞప్తి చేశారు.  త్వరలోనే మరిన్ని కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేయబోతున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు ఎమ్మెల్యే జిఎంఆర్ కు ఘన స్వాగతం పలికారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ కు హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, జడ్పిటిసి కుమార్ గౌడ్, గ్రామ సర్పంచ్ నరసింహారెడ్డి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, సురేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు, వివిధ సంఘాల అధ్యక్షులు, కుల సంఘాల ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు షేక్ హుస్సేన్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *