14‌వ రోజు కేరళలో.. కొనసాగిన రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో పాద యాత్ర

తిరువనంతపురం, సెప్గెంబర్‌ 21 : ‌కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నాయకుడు రాహుల్‌ ‌గాంధీ బుధవారం కొచ్చి సమీపంలోని మాదవనా నుండి తన పార్టీ భారత్‌ ‌జోడో యాత్రను తిరిగి ప్రారంభించారు. ముందుగా ఆయన సంఘ సంస్కర్త శ్రీనారాయణ గురుకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ‘‘ఈ రోజుకి స్ఫూర్తిదాయకమైన ప్రారంభం. గొప్ప ఆధ్యాత్మిక నాయకుడు, తత్వవేత్త మరియు సంఘ సంస్కర్త, శ్రీ నారాయణ గురువుకు నా నివాళులు అర్పిస్తున్నాను, ఆయన సమానత్వం యొక్క బోధనలు భారత్‌ ‌జోడో యాత్ర ఆలోచనకు కీలకం’’ అని ఈ సందర్భంగా రాహుల్‌ ‌గాంధీ ట్వీట్‌ ‌చేశారు.

కాంగ్రెస్‌ ‌నాయకుడు శ్రీ నారాయణ గురు చిత్రపటం ముందు ప్రార్థన చేస్తున్న ఫోటోను కూడా ఆయన పంచుకున్నారు. కాగా బుధవారం సీనియర్‌ ‌నాయకుడు సచిన్‌ ‌పైలట్‌, ‌రాష్ట్ర కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేతలతో పాటు మరికొందరు కూడా రాహుల్‌తో పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్ర ఉదయం 6.45 గంటలకు మదవన నుండి ప్రారంభం కాగా ఉదయం 13 కిలోమీటర్లు నడిచారు. విరామం అనంతరం యాత్ర కలమసేరి మున్సిపల్‌ ‌కార్యాలయం నుంచి సాయంత్రం 5 గంటలకు ప్రారంభమై పరవూరు జంక్షన్‌లో ముగిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *