– డీజీపీ శివధర్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అరైవ్-అలైవ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వంలో ఉన్న అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ రోడ్డు ప్రమాదాలు మన దేశంలోనే జరుగుతున్నాయని, ద్విచక్ర వాహనదారులు, పాదచారులు, రోడ్డు వెంట ఉన్న వారు ఎక్కువ సంఖ్యలో మృతిచెందుతున్నారని తెలిపారు. ప్రజా సంక్షేమం, భద్రతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు అమలు చేస్తోందని అన్నారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీల నుంచి సీఎం వరకు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం ఆదేశించినట్లు డీజీపీ తెలిపారు. ప్రతి గ్రామంలో రోడ్ సేప్టీ కమిటీని 8 నుంచి 9 మందితో ఏర్పాటు చేయాలని, దానిలో విరమణ పొందిన ఉద్యోగులు, మహిళలు, స్వచ్ఛంద సంస్థల బాధ్యులు ఉండేలా చూడాలని సూచించారు. ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని డీజీపీ ఆదేశించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





