13 న బేడ బుడగ జంగాల రౌండ్ టేబుల్ సమావేశం

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 08 : బేడ బుడగ జంగం భవిష్యత్తుకై చట్టసభల్లో ప్రాధాన్యత కొరకు, రాజ్యాధికార లక్ష్య సాధన కోసం బేడ బుడగ జంగం రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఈనెల 13న హైదరాబాదులో శాంతి చక్ర కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహిస్తున్నట్లు బేడ బుడగ జంగం యూత్ ప్రతినిధులు గిరి కొండపల్లి, పర్వతం శంకర్, సిరివాటి రమేష్, కళ్యాణం శరత్ చంద్ర, కడమంచి చెన్నయ్య, పసుపుల రాజేష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. విజన్-2024 రాజ్యాధికార లక్ష్య సాధన కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉండే బేడ బుడగ జంగం మేధావులు, ఉద్యోగస్తులు, సంఘ నాయకులు, యువ నాయకులను ఆహ్వానిస్తూ ప్రభుత్వం ద్వారా వచ్చే రాజకీయ ప్రతిఫలాలు, రానున్న శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్ల కేటాయింపు విషయం, భవిష్యత్ కార్యచరణ రూపొందించుకోవడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సమావేశానికి ప్రతి ఒక్కరు హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *