పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 11: ఈ నెల 13న పటాన్ చెరు నియోజకవర్గస్థాయి అభివృద్ధి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసినట్లు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.పటాన్ చెరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుండి చేపడుతున్న పనుల పురోగతి నూతనంగా చేపట్టబోయే అభివృద్ధి పనుల రూపకల్పనపై అన్ని విభాగాల అధికారులు, ప్రజా ప్రతినిధులతో చర్చించనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరిని అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తూ ముందుకు వెళ్తామని ఆయన తెలిపారు. హాజరైన నియోజకవర్గ ప్రజాప్రతినిధులు.
13 న నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం




