12 ‌మంది అభ్యర్థులతో బిజెపి నాలుగో జాబితా విడుదల

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబరు 7 : భారతీయ జనతా పార్టీ 12 మంది అభ్యర్థులతో నాలుగో జాబితాను ప్రకటించింది. ఇప్పటికే మూడు విడుతలుగా 88 మందిని ఖరారు చేసిన విషయం తెలిసిందే. దీంతో మొత్తం 100 స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలిపింది. మరో 19 స్థానాలు పెండింగ్‌లో ఉండగా.. వాటిలో 7 సీట్లు జనసేనకు కేటాయించింది. నామినేషన్ల గడువు మరో మూడు రోజుల్లో ముగియనున్నప్పటికీ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం గమనార్హం. ఇక బిజెపి నాలుగో జాబితాలో సీటు దక్కించుకున్న అభ్యర్థుల : చెన్నూరు – దుర్గం అశోక్‌, ఎల్లారెడ్డి – వీ. సుభాష్‌ ‌రెడి, వేములవాడ – తుల ఉమా, హుస్నాబాద్‌ – ‌బొమ్మ శ్రీరామ చక్రవర్తి, సిద్దిపేట – దూడి శ్రీకాంత్‌, ‌వికారాబాద్‌ – ‌పెద్దింటి నవీన్‌ ‌కుమార్‌, ‌కొడంగల్‌ – ‌బంటు రమేష్‌ ‌కుమార్‌ ‌గద్వాల – బోయ శివ, మిర్యాలగూడ – సాదినేని శ్రీనివాస్‌, ‌మునుగోడు – చెలమల్ల కృష్ణారెడ్డి, నకిరేకల్‌- ‌నకరకంటి మొగులయ్య, ములుగు- అజ్మీరా ప్రహ్లాద నాయక్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *