119 స్థానాల్లో ‘తెలంగాణ పొలిటికల్ ఫ్రంట్’ పోటీ

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 21 : నిజాయితీపరులకు ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి పార్టీ జాతీయ అధ్యక్షులు గొంటి కుమార్ చౌదరి యాదవ్ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని సాధారణ ఎన్నికల కోసం 10 రాజకీయ పార్టీలతో ‘తెలంగాణ పొలిటికల్ ఫ్రంట్’ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు శనివారం హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికలలో సమైక్యాంద్ర పరిరక్షణ సమితి పార్టీ, ఆధార్ పార్టీ ఇతర పార్టీలు కలిపి రాబోయే శాసన సభ ఎన్నికలలో 119 స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తొలి జాబితాలో భాగంగా 12 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మిగతా స్థానాలకు అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. కూటమి గుర్తు ‘రోటి మేకర్’ కు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. అనిల్ రెడ్డి(ఖైరతాబాద్), గోపాలకృష్ణ(జూబ్లీహిల్స్), కుమార్ చౌదరి(ఉప్పల్), శ్రీకరణ్ యాదవ్(సనత్ నగర్), కె.అర్జున్(మల్కాజ్ గిరి), విక్రమ్ యాదవ్(ముషీరాబాద్), రాజుగౌడ్(అంబర్ పేట్),ఎండీ.ఖలీల్(నాంపల్లి), ఎండీ.అంజాద్(కార్వాన్), జయశ్రీ గౌడ్(కుత్భుల్బాపూర్), ప్రసన్న రావు(కూకట్ పల్లి), మారమోని శ్రీశైలం యాదవ్(పటాన్ చెరు) లకు బి-ఫారంలు అందజేసినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *