‘‘వినాయకుడు, గణపతి మనకు ప్రథమ దైవం. ప్రధాన దేవుడు గణపతి. ఏ కార్యానికైనా ఏ అవరోధాలనైనా తొలగించి సిద్ధినీ, బుద్ధి (సమృద్ధి)నీ ప్రసాదించే దివ్యశక్తినే ‘గణపతిగా ఉపాసించడం వేద సంప్రదాయం. గణపతిని పూజించకుండా ఎలాటి శుభకార్యమూ తలపెట్టం. మంగళకరమైన కార్యాలలో వాటిల్లే విఘ్నాలను తొలగించేవాడు కనుక ఈయన విఘ్నేశ్వరుడుగా ఆరాధ్యుడైనాడు.’’
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం!
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే!!
వినాయకుడు, గణపతి మనకు ప్రథమ దైవం. ప్రధాన దేవుడు గణపతి. ఏ కార్యానికైనా ఏ అవరోధాలనైనా తొలగించి సిద్ధినీ, బుద్ధి (సమృద్ధి)నీ ప్రసాదించే దివ్యశక్తినే ‘గణపతిగా ఉపాసించడం వేద సంప్రదాయం. గణపతిని పూజించకుండా ఎలాటి శుభకార్యమూ తలపెట్టం. మంగళకరమైన కార్యాలలో వాటిల్లే విఘ్నాలను తొలగించేవాడు కనుక ఈయన విఘ్నేశ్వరుడుగా ఆరాధ్యుడైనాడు. భాద్రపద శుద్ధ చవితి, ఆగస్టు 31 వతేదీ, బుధవారం వినాయక చవితిని ప్రపంచవ్యాప్తంగా భక్తిప్రపత్తులతో జరుపుకుంటున్నాం. విష్ణుమూర్తిని పీతాంబరధరుడని చెప్పినట్లు గణపతిని శుక్లాంబరధరుడిగా చెప్పుకుంటాము. నీలమేఘశరీరుడు విష్ణువైతే గణపతి శ్వేతవర్ణుడు. ఏ పని మొదలుపెట్టాలన్నా మొదట పై శ్లోకంతో గణపతిని ప్రార్దిస్తాం. వినాయకుని స్తుతించే ఈ శ్లోకం నోటికి రానివారు దాదాపుగా ఉండరు. ఉపనిషత్తులు గణపతిని ‘త్వం వాజ్మయ త్వం విన్మయః’ అంటూ వాజ్మయ స్వరూపునిగా వర్ణించాయి.
గణానామ్ త్వా గణపతిగమ్ హవామహే/ కవిమ్ కవీనా ముపమశ్రవస్తవమ్/
జ్యేష్ఠ రాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత/ఆన శ్శృణ్వ న్నూతిభి స్సీద సాధనమ్!
యజ్ఞం లోకకళ్యాణ కృత్యం. ఆ యుగాదులలో ఆరాధించే దేవతాగణానికీ, మంత్ర సమూహానికీ, యజ్ఞికుల బృందానికీ ప్రభువై ఫలప్రదాతమై అనుగ్రహించే పరమేశ్వర స్వరూపమే గణపతి, వేదమంత్రాలకు ‘ప్రణవం (ఓంకారం) ఆదిగా ఉన్నప్పుడే ఆమంత్రం శక్తిమంతమవ్ఞతుంది. మంత్రాలకు పతివంటిది ఓంకారం. మంత్రాలే గణాలు, ఓంకారమే గణపతి. గణపతి సృష్టికి ముందు, సృష్టి తర్వాత ప్రళయానంతం కూడా సత్య స్వరూపుడై ప్రకాశించేవాడు. లక్ష్మీ గణపతిగా, విద్యా గణపతిగా, సిద్ధి గణపతిగా, తాండవ గణపతిగా, సింధూర గణపతిగా, ఏకదంతునిగా అనేకానేక ప్రకాశములతో భక్తులను అనుగ్రహిస్తాడు. ఆయనను స్మరిస్తే, ధ్యానిస్తే, పూజిస్తే సర్వారిష్టాలు తొలగి సర్వజయాలు కలుగుతాయి. ‘ఆదౌ పూజ్యోగణాధిపః’ సర్వకార్యములందు తొలిపూజలందువాడు. అట్టి గణపతి సంపూర్ణ వివరణలు అవతార ప్రాశస్త్యం గణేశపురాణంలో నిర్ణయించారు. బ్రహ్మాండానికి ప్రధాన దేవతగా వెలుగొందినవాడే గణపతి. గణానాంపతి ‘గణపతి అని వ్యుత్తత్పి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల తత్త్వాలకు ఆయన అధిపతి కాబట్టి గణపతి అయ్యాడు. సమస్త చేతన, అచేతన వర్గాలకు ఆయనే అధిపతి. ప్రతి కార్యారంభంలోనూ విఘ్నేశ్వరపూజ జరుపుతూనే వ్ఞన్నా భద్రపద శుద్ధి చవితినాడు వినాయకుని ప్రత్యేకంగా పూజించడంలో ప్రత్యేకత ఆరోజు వినాయకుడు జన్మించడమేగాక ఆనాడే ఆయనకు విఘ్నరాజత్వం సంప్రాప్తించడం, అందువల్ల వినాయక చవితి విశిష్ట పర్వదినంగా వినుతికెక్కింది.
శివపురాణం, వరాహపురాణం, బ్రహ్మవై వర్తపు రాణాల్లో గణపతి జన్మకు సంబంధించి విచిత్రమైన గాథ ఎన్నో ఉన్నాయి. బౌద్ధంలోనూ గణపతి ఆరాధన ఉంది. బుద్ధుడికి వినాయకుడు అనే పేరు ఉంది. గణపతికి ఎలుకనే కాకుండా నెమలి, సింహం, సర్వం కూడా వాహనాలు అని ముద్గల పురాణం పేర్కొన్నది. గణపతి ఆరాధనకు సంబంధించిన ఆధ్యాత్మిక వివరాలు అనేకం మన పురాణాలలో వేదవాజ్మయంలో నిక్షిప్తం చేసారు. వేదాలలో వర్ణితమైన విఘ్ననాయకుని దైవత్వం పురాణాలలో శాఖోపశాఖలుగా విస్తరించి వికాసం పొందింది. పదార్థాన్ని పెంచి పోషించి ప్రసాదించే పురాణాలు ప్రామాణికంగా పరిగణలో ఉన్నాయి. గణపతి జన్మ గురించి అనేక పురాణగాధలు ఉన్నాయి. స్కంధ, వామన, పద్మపురాణాలు, శివరహస్యం, తైత్తిరీయోపనిషత్తు గణపతి గజముఖుడుగానే జన్మించినట్లు చెబుతున్నాయి.
మాత్సర్యానికి సింహం, అహంకారానికి నెమలి, మమకారానికి సర్పం, లోభి మోహాలకు ఎలుక విధ్వంసకారులు సంకేతిస్తారు. సుందర సుగంధ పుష్పపత్రాలెన్నో ఉండగా వినాయ కుడిని దుర్వాంకురాల (గరిక)తో పూజిస్తేనే సంతుష్టు డవ్ఞతాడని అంటారు. వినాయకుడి పూజకు మట్టి విగ్రహాన్ని వాడడం శ్రేష్టం. గంగలోని మట్టితో విగ్రహం చేసి వినాయక చతుర్థినాడు పూజించి మర్నాడు మళ్లీ ఆ గంగలోనే కలపాలి. ఆ విధంగా సంవత్స రానికోసారి గంగాదేవిని గౌరవించుకుంటాననీ గణపతి దేవతలతో అన్నాడట. కనుక మట్టితో చేసిన విగ్రహాన్ని పూజిస్తేనే కార్యసిద్ధి. చవితి మర్నాడు శుక్ర లేక మంగళవారం అయితే మాత్రం రెండోరోజు కాకుండా మూడోరోజు స్వామిని నిమజ్ఞనం చేయాలి. మహాగణపతికి ప్రియమైన చతురావృత్త తర్పణం అనుష్టించడం వల్ల ఆయుష్ణు, బుద్ధి, యశస్సు, కవిత్వం, ఐశ్వర్యం, బలం, భుక్తి, ముక్తి, యుక్తి చేకూరుతాయి. బాహ్య సౌందర్యం కన్నా ఆత్మ సౌందర్యమే మిన్నయని గణేశుని రూపం బోధిస్తుంది.
వినాయకుని పూజతో ధ్యానం, అవాహనం, పంచామృతస్నానం, క్షీరసమర్పణ, దధి సమర్పణ, ఆజ్యసమర్పణ, శర్కర సమర్పణ, ఫలోదక సమర్పణ, వస్త్ర సమర్పణ, యజ్ఞోపతీత సమర్పణ, గంధసమర్పణ, ఆభరణ సమర్పణ, సింధూర సమర్పణ, రక్తాక్షి సమర్పణ, ధూపసమర్పణ దీప సమర్పణ, దక్షిణ సమర్పణ, ఫల సమర్పణ, తాంబూల సమర్పణ, దక్షిణ సమర్పణ చేయాలి. తరువాత నీరాజన, మంత్ర పుష్ప సమర్పణానంతరం వాయనం ఇచ్చి అనంతరం ఉద్వాసన చెప్పి, ఆచమనం చేస్తారు. సూర్యుడు నమస్కారప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు గణపతి తర్పణ ప్రియుడు. ఏ పండగకు లేని చిన్న బెదిరింపులాంటి విశేషం ఉంది వినాయక చవితికి. వినాయకుడికి పూజ చేసుకొని వ్రతకథ చదివి లేక విని అక్షింతలు తలపై వేసుకోక పోయినట్లయితే రాత్రి చంద్రుడిని చూస్తే నీలాపనిందలు కలుగునని ఆయన నమ్మకం. నిజంగా దైవభక్తి ఉన్నా లేకపోయినా ప్రతి ఆది వినాయక చవితికి ఆబాలగోపాలం పూజ చేస్తారు. వినాయక చవితికి మనం చేసే పూజలో నమ్మకమే కాదు. ఆరోగ్య సూత్రాలు కూడా ఉన్నాయి. మామూలుగా ఏ దేవుడినైనా పువ్వులతోనే పూజిస్తాం. వినాయకుడిని పువ్వులతో పాటు పత్రాలతో పూజిస్తాం. వినాయకుని మండపానికి కట్టి పాలవెల్లికి నేరేడు, మారేడు, సీతాఫల, జామ వంటి కాయలే కాక మొక్కజొన్న వంటివి కూడా వేలాడదీస్తాం. అలాగే, మనం పూజ చేసే ఆకులు, పత్ర మొదలైనవి కూడా ఆరోగ్యప్రదమైనవే. వాటి నుంచి వచ్చే ఒక విధమైన పరిమళంతో శ్వాససంబంధమైన వ్యాధులు నయమవుతాయి. విఘ్నేశ్వరుని పూజించడానికి మనం పాటించే నియమని ష్ఠలు కూడా ఆరోగ్యాన్ని చేకూర్చేవే. గణపతికి నువ్వులతో కూడిన లడ్డులంటే కూడా ఎంతో ఇష్టమట. ఆంజనేయుడిలాగే, విఘ్నేశ్వరుడికి కూడా సింధూరం అంటే ఇష్టం. దాంతో పూజిస్తే కోరిన కోర్కెలన్నీ నెరవేరతాయి.
మంత్రాలకు పతి వంటిది ఓంకారం. మంత్రాలే గణాలు, ఓంకారమే గణపతి. గణపతి సృష్టికి ముందు, సృష్టి తర్వాత ప్రళయానంతం కూడా సత్య స్వరూపుడై ప్రకాశించేవాడు. లక్ష్మీగణపతిగా, విద్యాగణపతిగా, సిద్ధిగణపతిగా, తాండ వగణపతిగా, సింధూర గణపతిగా, ఏకదంతునిగా అనేకానేక ప్రకాశములతో భక్తులను అనుగ్రహిస్తాడు. ఆయనను స్మరిస్తే, ధ్యానిస్తే, పూజిస్తే సర్వారిష్టాలు తొలగి సర్వజయాలు కలుగుతాయి. ‘ఆదౌ పూజ్యోగణాధిపః సర్వకార్యములందు తొలిపూజలందువాడు. సమస్త చేతన, అచేతన వర్గాలకు ఆయనే అధిపతి. ప్రతి కార్యారంభంలోనూ విఘ్నేశ్వరపూజ జరుపుతూనే వద్దన్నా భాద్రపద శుద్ధి చవితినాడు వినాయకుని ప్రత్యేకంగా పూజించడంలో ప్రత్యేకత. ఆరోజు వినాయకుడు జన్మించడమేగాక ఆనాడే ఆయనకు విఘ్నరాజత్వం సంప్రాప్తించడం, అందువల్ల వినాయకచవితి విశిష్ట పర్వదినంగా వినుతికెక్కింది.
– నందిరాజు రాధాకృష్ణ, 9848128215




