భారత్‌ ‌జోడో యాత్రలో కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ

తిరువనంతపురం, సెప్టెంబర్‌ 14 : ‌రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్రకొనసాగుతుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దాదాపు 1,000 చదరపు కిలోవి•టర్ల భారత భూభాగాన్ని చైనాకు అప్పగించిందని కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ ఈ సందర్భంగా ఆరోపించారు. ఎటువంటి పోరాటం లేకుండానే ఇచ్చేసిన ఈ భూమిని తిరిగి ఎలా స్వాధీనం చేసుకుంటారో చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. 2020 ఏప్రిల్‌ ‌నాటికి ఉన్న స్థితిని పునరుద్ధరించాలని భారత దేశం చేసిన డిమాండ్‌ను చైనా తిరస్కరించిందని చెప్పారు.

ఎంత భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటారో ప్రభుత్వం చెప్పగలదా అని బుధవారం ఇచ్చిన ట్వీట్‌లో ప్రశ్నించారు. రాహుల్‌ ‌గాంధీ బుధవారం భారత్‌ ‌జోడో యాత్రకు ముందు కేరళలోని శివగిరి మఠాన్ని సందర్శించి, సంఘ సంస్కర్త శ్రీ నారాయణగురుకు పూజలు చేశారు. మఠంలోని స్వావి•జీలతో మాట్లాడారు. వైకులం కూడలి నుంచి బుధవారం ఉదయం 7.30 గంటలకు నాలుగో రోజు భారత్‌ ‌జోడో యాత్రను రాహుల్‌ ‌ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *