‘‘మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపే రుగ్మతే బైపోలార్ డిజార్డర్. బై పొలార్ రుగ్మత ఉన్న వ్యక్తులు ఉవ్వెత్తున లేస్తారు… డబీల్ మని పడిపోతారు. ఇంతలోనే ఉత్సాహం… అంతలోనే ఉత్పాతం.కెరటం అంత బలంగా ఉన్నారు అనుకుంటాం అంతలోనే అంతకంటే ఎక్కువగా బలహీన పడిపోతారు. రూపాయి నాణేన్ని టేబుల్ మీద తిప్పితే ఒకసారి బొమ్మ… ఒకసారి బొరుసు కనిపించినట్టే వీళ్లలో సంతోషం… విచారం స్వల్ఫ వ్యవధిలోనే చూపిస్తూ ఉంటారు. ఇదో షాకింగ్ డిజార్టర్.’’
జీవితంలో మానసికంగా కొన్ని హెచ్చుతగ్గులు సర్వసాధారణం. అయితే బైపోలార్ డిజార్డర్ ఉన్నవారిలో ఈ మానసిక అసమతు ల్యతలు విపరీతంగా ఉంటాయి. అంటే సంతోషంగా ఉన్నప్పుడు మరీ ఎక్కువగా ఎగ్జయిట్‌మెంట్‌కి లోనుకావడం, అలాగే బాధగా ఉన్నప్పుడు మరీ ఎక్కువగా కుంగిపోవడం జరుగుతుంది. భయంకరమైన మానసిక వ్యాధుల్లో బై పోలార్ డిజార్డర్ కూడా ఒకటి. ఆధునిక సమాజంలో మానసిక ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. వాటిల్లో కొన్ని సాధారణంగా ఉంటే, కొన్ని ప్రమాదకరమైనవి కూడా ఉన్నాయి. ప్రమాదకరమైన వాటిలో ‘బై పోలార్ డిజార్డర్’ ఒకటి. దీన్ని మానిక్ డిప్రెసివ్ మూడ్ డిజార్డర్ అని అంటారు. దీనికి కచ్చితంగా వైద్య సహాయం అవసరం. బై పొలార్ డిజార్డర్ వ్యక్తులు తీవ్రమైన మానసిక కల్లోలంతో ఉన్మాదిగా మారే అవకాశం ఉంది.
బైపోలార్ డిజార్డర్ ను గతంలో మానిక్ డిప్రెషన్ అనేవారు.

ఇది పని ఒత్తిడి ఎక్కువగా ఉండే వారికి వస్తూ ఉంటుంది. లేదంటే.. ప్రేమించిన వాళ్లు దూరమైన, అయిన వాళ్లు చనిపోయినా, ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నా, మత్తుపదార్థాలకు బానిసైనా వ్యక్తులు బైపోలార్ డిజార్డర్‌లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. బైపోలార్ వ్యాధి అంటే ఒక మనిషిలో రెండు రకాల పరస్పర వ్యతిరేక లక్షణాలు ఉంటాయి. మానియా, డిప్రెషన్ రెండు రకాల లక్షణాలు ఉంటాయి. మానియ దశలో మితిమీరిన సంతోషం, ఆత్మవిశ్వాసం, అతిగా గొప్పలు చెప్పడం, నృత్యం చేయడం, పాటలు పాడడం, అతిగా సెక్స్ కోరికలు, విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తారు. డిప్రెషన్ దశలో తీవ్రమైన మానసిక బాధ, ఆత్మవిశ్వాసం సన్నగిల్లడం, ఏ పనిపైనా స్పష్టత లేకపోవడం, ఆత్మహత్య ఆలోచనలు రావడం, పూర్తిగా నిరాశకు లోనవుతారు. ఈ వ్యాధి వంశపారంపర్యంగా, మానసిక ఒత్తిళ్ల వలన వస్తుంది.
మానసిక ప్రశాంతత ముఖ్యం
బైపొలార్ డిజార్డర్ వ్యక్తులపట్ల ఎక్కువ శ్రద్ధ, ప్రేమ చూపాల్సిన అవసరం ఉంది. ఈ రుగ్మత ఉన్నవారు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. మళ్లీ సాధారణ స్థితికి వచ్చినప్పుడు తమ తప్పులను తెలుసుకుంటారు. ఈ రుగ్మత ఉన్నవారిని ప్రశాంతంగా ఉండనివ్వాలి. అలసి పోకుండా జాగ్రత్త పడాలి. పదిమందితో కలిసేలా చూడాలి. ఆ వ్యక్తి మనోభావాలు కొన్ని సందర్భాలలో విచిత్రంగా ఉండవచ్చు, ఆ వ్యక్తి పట్ల ఉన్న ప్రేమను గుర్తుంచుకోండి అస్సలు వదిలివేయవద్దు. కుటుంబ సభ్యుల సహాయ సహాకారాలు పూర్తి స్తాయిలో బై పొలార్ డిజార్డర్ ఉన్న వ్యక్తికి సమయానుగుణంగా ప్రణాళిక బద్దంగా అందించాలి. మానసిక కల్లోలం యొక్క హెచ్చరిక సంకేతాలను సరైన సమయంలో గుర్తించి సైకాలజిస్టుల సహకారం లేదా సైకియాట్రిస్టులను సంప్రదించాలి.

సైకోథెరపీ తో నయం
బైపోలార్ డిజార్డర్ అనేది జీవితకాలం ఎదుర్కొనే పరిస్థితి అయినప్పటికీ, చికిత్స ప్రణాళికను క్రమ పద్దతిలో నిర్వహించడం ద్వారా మానసిక కల్లోలంను తగ్గించడానికి ఎక్కువ అవకాశం ఉంది. చాలా వరకు బైపోలార్ డిజార్డర్ ను మందులు మరియు సైకోలాజికల్ కౌన్సెలింగ్ (సైకోథెరపీ)తో నయం చేయడానికి అవకాశం ఉంది.ఇంటర్ పర్సనల్ మరియు సోషల్ రిథమ్ థెరపీ

ఇంటర్ పర్సనల్ మరియు సోషల్ రిథమ్ థెరపీ నిద్ర ఆహార సమయాలను ఒక క్రమ పద్దతిలో నిర్వహించడం ద్వారా మూడ్ మేనేజ్‌మెంట్‌ను సరిచేయడం జరుగుతుంది. బైపోలార్ డిజార్డర్ ఉన్న వ్యక్తులు నిద్ర, ఆహారం మరియు వ్యాయామం కోసం రోజువారీ దినచర్యను ఏర్పాటు చేయడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు.
సి బి టి తో సానుకూల ఫలితం
బైపోలార్ డిజార్డర్ (సైకో ఎడ్యుకేషన్) మానసిక విద్య గురించి నేర్చుకోవడం ద్వారా స్నేహితుల పరిస్థితిని అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. మానసిక సమస్యలను గుర్తించడం వాటి పట్ల అవగాహన పొందడం వల్ల ఉత్తమమైన చికిత్సను పొందడంలో సహాయపడుతుంది. కాగ్నిటివ్-బిహేవియరల్ థెరపీ తో మానసిక ఆలోచనలు, మేధో చిత్రాలను మార్చడం, వ్యక్తి భావోద్వేగాలు మరియు ప్రవర్తనకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో దోహదం చేస్తుంది. అన్ని ఆలోచనలను క్రమబద్ధీకరించడం ద్వారా ఫలితం సానుకూలంగా ఉంటుంది.

మూడ్ ఛార్ట్ ను తయారు చేసుకోవాలి
బైపోలార్ డిజార్డర్‌ను మరింత తీవ్రతరం చేసే జీవనశైలిలో మార్పులను సవరించుకోవాల్సిన అవసరం ఉంది. బైపోలార్ డిజార్డర్‌తో ఉన్న అతిపెద్ద ఆందోళనలలో ఒకటి రిస్క్-టేకింగ్ ప్రవర్తన మరియు డ్రగ్స్ లేదా ఆల్కహాల్ దుర్వినియోగం ప్రతికూల పరిణామాలు. మద్యపానం లేదా వినోద ఔషధాలను ఉపయోగించడం మానేయాలి. సానుకూల ప్రభావం చూపే వ్యక్తులు, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో ఆరోగ్యకరమైన సంబంధాలను ఏర్పరచుకోవడం ద్వారా మానసిక స్థితి మార్పుల హెచ్చరిక సంకేతాలను చూడడంలో సహాయపడగలరు. నిద్రపోవడం, తినడం మరియు శారీరక శ్రమ కోసం ఒక సాధారణ దినచర్యను కలిగి ఉండటం ద్వారా మానసిక స్థితిని సమతుల్యం చేసుకోగలుగుతారు. మూడ్ చార్ట్ ను తయారు చేసుకోవాలి. ఒత్తిడిని తగ్గించడానికి కావల్సిన యోగా, ధ్యానం రోజూ చేయాలి.

డా.అట్ల శ్రీనివాస్ రెడ్డి
రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్
ఫ్యామిలీ కౌన్సెలర్, 9703935321