ఆమె అందరికి అమ్మ. దైవం పంపిన తల్లి. దీన జనోద్ధకురాలు. సాటి మనష్యులకు సేవ చేయాలన్న సంకల్పం చిన్న నాట నుంచే అలవర్చుకున్నారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న సూక్తిని ఆలంబనగా చేసుకున్నారు. పుష్ప పరిమళ సుగంధాలు వ్యాపించిన తీరు వలె తన మనసులోంచి జాలువారిన సదాలోచనలు ప్రపంచానికే స్ఫూర్తినిచ్చాయి. తోటివారికి సేవచేయడానికి తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసిన త్యాగధనురాలు…ఇంతకి ఏవరా అమ్మా? ఎవరు ఆ తల్లి అనుకుంటున్నారా ఆమే మానవతకు మాతృమూర్తి మదర్ థెరిసా..
యుగోస్లేవియా దేశంలోని స్కొప్జి అనే గ్రామంలో అల్బేనియా జాతికి చెందిన రైతు దంపతులకు 1910,ఆగస్ట్ 27 మదర్‌థెరిసా జన్మించారు. ఆమె పూర్వపు పేరు ఆగ్నస్ గోన్షాభోజాక్షువు. తండ్రి వారసత్వంగా వచ్చిన లక్షణాలను పుణికి పుచ్చుకుంది. తండ్రి బాటలో నడచిన తనయగా కీర్తిగడిరచింది ఆమె. తాను చదివే రోజుల్లో తన సేవాగుణానికి అద్దంలా నిలిచే ఓ ఉదాహరణ ఉంది. పాఠశాలకు వెళ్తున్న క్రమంలో ఆగ్నస్ (మదర్ థెరిసా) తరగతి ఉపాధ్యాయిని హాజరు పట్టిక చదువుతూ ఉంది. పేర్లను చదివే క్రమంలో ఆగ్నస్ అని పిలిచింది. తరగతి గదిలో మారు వినపడక పోవడంతో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. పిమ్మట మే ఐ కమిన్ టీచర్ అనే గొంతు వినిపించింది తరగతి ఉపాధ్యాయినికి . ఆ గోంతు ఆగ్నస్‌దిగా గుర్తించి తరగతి గదికి ఆలస్యంగా రావడానికి కారణమేమిటని ప్రశ్నించారు.
ప్రశ్నకు బదులుగా ఆగ్నస్ సమాధానం ఇలా చెప్పారు. దారిలో ఓ వృద్దుడు అనారోగ్యంతో బాధపడుతుంటే అతనిని చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించానని బదులు చెప్పారు. తన సమాధానం విన్న ఆ ఉపాధ్యాయిని ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇంత చిన్న వయసులో ఎంతటి సేవాలక్ష్యం కనబరచిందని ఆగ్నస్‌ను ప్రశంసించారు. మంచితనం మానవత్వం దయాగుణం సహాయత్వం అనేవి ప్రతి మనిషి అలవర్చుకోవాలని భగవంతుడు మనకు ఇంతటి గొప్ప జీవితాన్ని ఇచ్చింది ఎంతో కొంత సహాయపడడానికి అని దైవం చెబుతుంది. దైవం మాట ప్రకారం నడయాడిన ఆమె పేదల పాలిట పెన్నిధిగా మారి అభాగ్యుల పాలిట ఆశాజ్యోతిగా మారారు.
తన మనసు నిండా యేసు ప్రభువు పట్ల విశ్వాసం కనబర్చారు. ధీన జనులకు దయామయిగా మారి అందరికి అమ్మ రూపంలో దర్శనమిచ్చారు. కష్టాలలో ఉన్న వారికి కష్టాలు తీర్చే కల్పవల్లిలా మారి జనులకు సేవా మూర్తిగా మారింది. 1950లో వాటికన్ అనుమతితో మిషనరీస్ ఆఫ్ చారిటీని ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ద్వారా ఎందరో అభాగ్యులకు రోగులకు సేవలందించారు. అనాథ శరణాలయాలు ధర్మశాలలు వ్యాధి గ్రస్తులకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. మిషనరీస్ ఆఫ్ చారిటీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక శాఖలను కలిగి ఉంది. నిరాశ్రయులైన వారికి సహాయం చేయడానికి ఉపయోగపడుతోంది. 1965 లో పోప్‌పాల్ 6 డిక్రీ ద్వారా ఈ సంస్థ అంతర్జాతీయ మత కుటుంబంగా మారింది.
సిస్టర్‌గా మారారిలా… .
చిన్న వయసులో సన్యాసి కావాలని తలంచింది. పేదలకు సహాయం చేయాలన్న ఆకాంక్షతో సేవే మార్గమన్న నినాదంతో పిలుపునిచ్చింది. ఐర్లాండ్ లోని సన్యాసుల బృందంతో చేరడానికి అనుమతి లభించింది. 1931లో తన అధికార మతపరమైన ప్రమాణాలను స్వీకరించింది. మిషనరీల పోషకుడైన సెయింట్ థెరీస్ ఆఫ్ లిసియక్స్ పేరు పెట్టాలని నిర్ణయించారు. 1937 మే 4 తేదీన తొలుత ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించారు. భారతదేశానికి వచ్చిన తరువాత ఉపాధ్యాయురాలిగా మారారు. బాలబాలికలను చేరదీసి విద్యాబోధన చేశారు. గత కాలంలో ఆధునిక రోజుల వలే సౌకర్యాలు లేకపోవడంతో సహజ సిద్ధంగా నేలపై నీటిని చల్లి అక్షరాలను రాసి విద్యార్థులకు నేర్పారు. విద్యకు ప్రాచుర్యం కల్పించారు. విద్యతోనే సమాజాభివృద్ధి చెందుతుందని భావించి మన భారతవనిలో విద్యాలయాలను నెలకొల్పారు.
ఆమె భారతీయ సంప్రదాయ దుస్తులను గౌరవిస్తూ నీలం అంచుతో కూడిన తెల్లటి భారతీయ చీరను ధరించడం ఇష్టపడే వారు. ఇతరులకు సేవచేయడం ఏసు క్రీస్తు బోధనలు ప్రాథమిక సూత్రంగా భావించారు. అనంతరం‘ మానవ సేవే మాధవ సేవ’గా భావించి మానవ సేవకు శ్రీకారం చుట్టారు. అనాథల కోసం మోతీజీ అనే పాఠశాలను ఏర్పాటు చేసి వారి బాగోగులను చూసుకున్నారు.
భారతీయ పౌరసత్వం, భారత పురస్కారాలు ..
పరిమళించిన పువ్వులా వికసించిన ఆమె మానవత్వం అనిర్వచనీయం. ఇంతటి మహోన్నతురాలికి భారతదేశం 1951లో భారత పౌరసత్వం లభించింది. 1960 దశకంలో మదర్‌థెరిసా జీవితాన్ని మాల్కం ముగ్గేరిడ్జ్ అనే ఒక పుస్తకాన్ని రాసి సమ్‌థింగ్ బ్యూటి ఫుల్ ఫర్ గాడ్ అనే డాక్యుమెంటరీని రూపొందించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా రూ.192,000 నిధిని పేదలకు ఇవ్వాలని కోరింది. తరువాత సంవత్సరాల్లో ఆమె అభివృద్ధి చెందిన దేశాలలో మరింత చురుకుగా ఉండేది. ఒకనోక దశలో ఓ వ్యక్తి ప్రపంచశాంతిని ఎలా ప్రొత్సహించాలి అని ఆమెను అడిగినప్పుడు ఇంటికి వెళ్లి మీ కుటుంబాన్ని ప్రేమించండి అని సమాధానమిచ్చిన తీరు ఆమె వ్యక్తిత్వంలో తొణికీసలాడిరది. పేదలకు సేవ చేయాలన్న లక్ష్యాన్ని విడనాడకుండా పనిచేశారామే. 1979లో ఆమె సేవలకు గుర్తింపుగా నోబెల్‌శాంతి బహుమతి, జవహార్‌లాల్ నెహ్రూ అవార్డు పొందారు. భారతదేశంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం భారత రత్న అవార్డును జనవరి 25 1980 సంవత్సరంలో మదర్‌థెరిసా పొందారు.
ప్రముఖులతో పరిచయాలు….
మధర్‌థెరిసా వ్యక్తి గత జీవితంలో ఎంతో మంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ్డాయి. వివిధ దేశాలలో ప్రముఖ వ్యక్తులో కలిసి ముచ్చటించిన సందర్భాలు కోకొల్లలు. మాజీ ప్రధాన మంత్రులు, వివిధ దేశాలకు చెందిన రాణులతో సత్సంబంధాలు కలిగి ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాల క్రితం న్యూయార్క్‌లోని బ్రాంక్స్ ప్రిన్సెస్ డయానాను కలుసుకున్నారు.
అస్తమయం..
ఎన్నో సేవా కార్యక్రమాల రూప శిల్పి మదర్‌థెరిసా చివరకు తన అనారోగ్యం కారణంగా 1997 సెప్టెంబర్ 05 న మరణించారు. ఆమె మరణాంతరం వాటికన్ బీటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభించింది. ఇది కానోనైజేషన్ మరియు సెయింట్ హుడ్ మార్గంలో ద్వితీయ మెట్టు. మదర్‌థెరిసా ప్రపంచానికి గొప్ప ఉదాహరణ మరియు స్ఫూర్తిని అందించిన సజీవ సాధువు.
మరిపెడ బంగ్లా సేవానగర్.




