111‌జీఓ రద్దుతో హైదరాబాద్‌కు ముప్పు

అప్పులకుప్పగా తెలంగాణ
నీతి ఆయోగ్‌కు వెళ్లకుండా ఏం చేస్తున్నట్లు
అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
హాలు విస్మరించినందుకు ఎన్నిసార్లు తల నరుక్కోవాలి
డియా సమావేశంలో   కేంద్రమంత్రి  కిషన్‌ ‌రెడ్డి విమర్శలు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే27: నీతి ఆయోగ్‌ ‌కు దూరంగా ఉన్న సీఎంలపై  కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్‌ ‌కంటే కేసీఆర్‌ ‌కు ముఖ్యమైన పనేముందని ప్రశ్నించారు.  నీతి ఆయోగ్‌ ‌సమావేశానికికు వెళ్లకపోవడం దురదృష్టకరమన్నారు. తెలంగాణలో పేదరికం లేనట్లుగా కేసీఆర్‌ ‌మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్టాన్న్రి అప్పులపాలు చేసి అభివృద్ది చేశామని గొప్పలు చెబుతున్నారని మండిపడ్డారు. కేంద్రాన్ని, ప్రధానిని విమర్శించడమే కేసీఆర్‌ ‌పనిగా పెట్టుకున్నారని కిషన్‌ ‌రెడ్డి  ధ్వజమెత్తారు.   అన్ని రాష్టాల్రను ఏకం చేసుకుని మోడీ  ముందుకెళ్తున్నారని చెప్పారు. రాష్టాన్న్రి కేసీఆర్‌ అప్పు‌ల కుప్పగా మార్చిండని.. ఆదాయానికి మించి అప్పలు చేస్తున్నారని విమర్శించారు.  రాష్ట్రంలో భూములు అమ్మితేగానీ ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. రైతుల సమస్యలను కేసీఆర్‌ ‌పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

పిల్లలు పుట్టినా కళ్యాణ లక్ష్మీ డబ్బులు అందడం ఇంత వరకు అందడం లేదన్నారు.  పాత అప్పుల వడ్డీలకు సంవత్సరానికి 20 వేల కోట్లు చెల్లించాల్సి వస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 3.50 లక్షల కోట్ల అప్పు ఉందని.. బడ్జెట్‌ ‌యేతర అప్పులు కలుపుకుంటే 6 లక్షల కోట్ల అప్పు  ఉందని తెలిపారు.   అయినా  కేసీఆర్‌ అప్పు‌ల దాహం తీరడం లేదన్నారు. 111 జీవో రద్దుతో  హైదరాబాద్‌కు ముప్పు వాటిల్లిందన్నారు. మాట తప్పితే తల నరుక్కుంటానన్న కేసీఆర్‌.. ‌కొన్ని వేలసార్లు తల నరుక్కోవాల్సి వచ్చేదన్నారు.  పార్టీ ఆఫీసులకు కేసీఆర్‌  ‌స్థలం ఇస్తారు కానీ  పేదలకు ఇవ్వడం లేదన్నారు. పార్టీ ఆఫీసుల పేరుతో కాంగ్రెస్‌ ‌పార్టీకి 10 ఎకరాల భూమి కేటాయించారు కానీ.. దళితలకు మూడెకరాలు ఇవ్వడం లేదన్నారు. ఈ సందర్బంగా డియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌టార్గెట్‌గా తీవ్ర విమర్శలు గుప్పించారు.2014లో సీఎంగా ప్రమాణస్వీకారం చేయకముందే కేసీఆర్‌ ‌తల నరుక్కోవాలని వ్యాఖ్యానించారు. దళిత సీఎం, మూడెకరాల భూమి, డబుల్‌ ‌బెడ్రూం ఇళ్లు సహా కొన్ని వందల సార్లు తెలంగాణ సీఎం కేసీఆర్‌ ‌మాట తప్పారని విమర్శించారు.

తెలంగాణకు కేంద్రం సాయంపై చర్చకు సిద్ధమని కేసీఆర్‌కు కిషన్‌ ‌రెడ్డి సవాలు విసిరారు. తెలంగాణ ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ ‌కంపెనీగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో దేశవ్యాప్తంగా డబ్బులు పంచడం కోసమే 111 జీవో రద్దు చేశారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ‌నేతలకు 111 జోవో పరిధిలో వందలాది ఎకరాలున్నాయన్నారు. బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌లు కలసి మాట్లాడుకుని కార్యాలయాలకు భూములు తీసుకున్నారని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబానికి భూ దాహం, అప్పుల దాహం తీరటం లేదని ధ్వజమెత్తారు. నీతి ఆయోగ్‌ ‌సమావేశానికి సీఎం కేసీఆర్‌ ‌హాజరుకావపోవటం తెలంగాణకు తీవ్ర నష్టం అన్నారు. నీతి ఆయోగ్‌ ‌సమావేశం కంటే కేసీఆర్‌కు ముఖ్యమైన పని ఏముందో చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. 30 వేల ఎకరాలను అమ్మటానికి కేసీఆర్‌ ‌ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

111 జీవో రద్దుతో ఎప్పటికైనా హైదారాబాద్‌కు ముప్పు తప్పదని హెచ్చరించారు. 111 జీవో ఎత్తివేస్తే హైదరాబాద్‌ ఏమైపోతుందో ప్రభుత్వం ఆలోచన చేయాలి. అప్పులపై తెలంగాణ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలి. 135 ఏళ్ల చరిత్ర కలిగిన వరంగల్‌ ‌జైలు భూములు తాకట్టు పెట్టారని వార్తలొస్తున్నాయి. నీ తెలంగాణ.. నా తెలంగాణ కాదు.. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమని కేసీఆర్‌ ‌గుర్తుంచుకోవాలి. గుణాత్మకమైన మార్పు తీసుకొస్తానన్న కేసీఆర్‌ ఇం‌ట్లో కూర్చున్నారు. కేంద్రాన్ని, ప్రధానిని ఆడిపోసుకోవటం తప్ప కేసీఆర్‌ ‌చేసిందే లేదు. మహారాష్ట్రలో తలకుమాసిన వాళ్లు మాత్రమే బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. రైతులకు తెలంగాణ ప్రభుత్వం 50 వేల కోట్లు బకాయిలు చెల్లించాలి. కేసీఆర్‌ ‌హాయాంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. మోదీ సమర్థ నాయకత్వం వలనే దేశ ఆర్థిక వ్యవస్థ బలపడిందని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *