ప్రజాతంత్ర చేవెళ్ళ డివిజన్ అక్టోబర్ 19: మంచితనానికి మారు పేరు కాలే యాదన్నా ఓపికకు నిలువెత్తు దర్శనం కాలే యాదన్నా అయన మంచితనమే మరోసారి గెలిపిస్తూందాన్నారు.చేవెళ్ల నియోజకవర్గ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాలే యాదయ్య చేవెళ్ల మండల కేంద్రంల ప్రజా ఆశీర్వాద యాత్రలోభాగంగా ఇంటింట ప్రచారం చేశారుఈ సందర్భంగాఎమ్మెల్యే అభ్యర్థి కాలే యాదయ్య మాట్లాడుతూబీఆర్ఎస్
పార్టీ అన్నీటిలోముందుంటుందన్నారు. అభ్యర్థుల ప్రకటనలో,మ్యానిఫెస్టో ప్రకటనలో,గెలుపులో కూడా ముందుంటుందన్నారు.ఆసరా పెన్షన్
దళిత బంధు,రైతు బంద్,రైతు బీమా కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలకు నగదు పెంచి పేరు మార్చి కాంగ్రెస్ పార్టీ మా పథకాలను కాపీకొట్టిందన్నారు. .తెలంగాణ రాష్ట్రం తెచ్చిన నాయకుడు మన కేసీఆర్ అన్నారు.తెలంగాణ పట్ల అంత బాధ్యతగా ఎవరు ఉండరని హర్షం వ్యక్తం చేశారు.కెసిఆర్ భీమా ప్రతి ఇంటికి ధీమా సౌబాగ్య లక్ష్మీ వంటి పథకాలను మహిళలా కోసం తెచ్చిన మహిళా పక్షపాతి కెసిఆర్ అన్నారు.ప్రతి నెల మహిళలాకు 3000 ఇవ్వాలని సౌభాగ్యా లక్ష్మి తేనున్నారన్నారు.సిలిండర్ ని 400 రూపాయలకే పేదలకు అందించాలని కెసిఆర్ నిర్ణయించారన్నారు.అద్భుతమైన పథకం ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఇవ్వాలని మేనిఫెస్టోలో పెట్టారన్నారు.గతపాలకులులుముక్కిపోయిన కుళ్ళిపోయిన బియ్యం ఇచ్చేవారనిఆసరా పెన్షన్లను 5 వేలకు పెంచడం వికలాంగులకు 6000 పెంచడం రైతుబంధుని 16000కు పెంచుతూ మేనిఫెస్టోలో ప్రవేశపెట్టారని కేసీఆర్ ని కొనియాడారు టికెట్లు ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ నాయకుల నిజ స్వరూపం బయటపడుతున్నదన్నారు.10 కోట్లకు టికెట్ అమ్ముకున్నారు ఐదు ఎకరాలకు టికెట్ అమ్ముకున్నారని ఢిల్లీలో గల్లీలో కాంగ్రెస్ నాయకులు నిరసనలుతెలుపుతున్నారన్నారు.కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు ఆనాడు నోటుకు ఓటుకు అడ్డంగా దొరికితే,నోట్లకి సీట్లు అమ్ముకుంటున్నారని గాంధీభవన్లో కాంగ్రెస్ నాయకులు బహిరంగంగా చెబుతున్నారన్నారు.ఒకసారి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అడుగుతుందన్నారు.11 సార్లు అవకాశం ఇచ్చిన ఏం చేశారని యాదన్న మండిపడ్డారు.9 సంవత్సరాలలో కేసీఆర్ చేసిన అభివృద్ధి చూసి ప్రజలు కేసీఆర్ ను గెలిపించుకోవాలని చూస్తున్నారన్నారు.ఈ కార్యక్రమంలో అభిమానులు,కార్యకర్తలు,చేవెళ్ల ప్రజలు బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.




