– కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు
యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని 10వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న చైర్మన్ అభ్యర్థి గుండ్లపల్లి వాణిభరత్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ వార్డులో కాంగ్రెస్ నుంచి వాణిభరత్, బీఆర్‌ఎస్ నుంచి ఒకరు నామినేషన్లు దాఖలు చేయగా మంగళవారం చివరి రోజు బీఆర్‌ఎస్ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకున్నారు. దీంతో వాణిభరత్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఆమెకు అభినందనలు తెలిపారు. ఆమెకు శాలువా కప్పి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో విజయం సాధించి పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని ఆయన ఆకాంక్షించారు. వాణిభరత్ మాట్లాడుతూ మున్సిపాలిటీలోని 10వ వార్డుతోపాటు మిగతా 11 వార్డులను కూడా సమగ్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే ఐలయ్య సహకారంతో ప్రజల నమ్మకానికి తగ్గట్టు పట్టణాభివృద్ధికి కృషి చేస్తామని స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





