108 అంబులెన్స్ ని ఆకస్మిక తనిఖీ  చేసిన ఎమర్జెన్సీ మెడికల్ ఎక్జిక్యూటివ్ అధికారి కుమార స్వామి

 జగదేవపూర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7: జగదేవపూర్ మండల కేంంద్రంలోని  108 అంబులెన్స్ ని ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీస్ సిద్దిపేట జిల్లా ఎమర్జెన్సీ మెడికల్ ఎక్జిక్యూటివ్ జంపాల కుమార స్వామి ఆకస్మిక తనిఖీ చేసారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..తనిఖీ లో భాగంగా అంబులెన్స్ లోని పరికరాలను రికార్డ్స్ ను పరిశీలించి,  సిబ్బంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, ఆరోగ్యం, పైలట్ పాతూరి సుధాకర్ రెడ్డి  పనితీరును అభినందించమాని అన్నారు.అదేవిధంగా ప్రభుత్వం సమకూర్చిన అంబులెన్స్ ను ప్రజలు అత్యవసర,ఆపద సమయంలో సద్వినియోగం చేసుకోవాలని సిద్ధిపేట జిల్లా ప్రాజెక్టు మేనేజర్ షేక్ సలీం, తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *