ఇప్పటివరకు పది వేల విమాన సర్వీసుల రద్దు

– పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ప్రయాణికుల ఇక్కట్లు

న్యూదిల్లీ, ఏప్రిల్  7: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ నుంచి ఆ ప్రాంతానికి వెళ్లే విమాన సర్వీసులను దేశీయ విమానయాన సంస్థలు రద్దు చేస్తున్నాయి. యుద్ధం ప్రారంభమైన నాటినుంచి ఇప్పటివరకు 10 వేలకు పైగా విమాన సర్వీసులు రద్దయినట్లు పౌర విమానయాన శాఖ వెల్లడించింది. పశ్చి మాసియాకు భారత్ నుంచి రోజుకు 300 నుంచి 350 వరకు విమాన సర్వీ సులు నడుస్తుంటాయి. ఘర్షణల కారణంగా ఆ సంఖ్య 80-90కి పడిపోయిందని పేర్కొంది. మరోవైపు సుదూర విమాన ప్రయాణాలకు సంబంధించి పైలట్ట ‘ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్’ను డీజీసీఏ తాత్కాలికంగా సడలించింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *