10‌న రాష్ట్ర కేబినేట్‌ ‌భేటీ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6 : ‌రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల పదో తేదీన ప్రగతిభవన్‌లో జరుగనున్నది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షత వహించే ఈ సమావేశంలో..ధాన్యం కొనుగోళ్లను మరింత ముమ్మరం చేయడంపై చర్చించే అవకాశం ఉన్నది. సొంత జాగలు ఉన్న బలహీన వర్గాలకు ఇండ్లు కట్టుకునేందుకు ఆర్థిక సహాయం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం మహబూబ్‌నగర్‌ ‌సభలో ప్రకటించారు.

ఈ నేపథ్యంలో ఈ అంశంతోపాటు..రైతుబంధు నిధుల విడుదల, దళితబంధు పథకం అమలు తదితర అంశాలపైనా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నది. శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరిగే క్యాబినెట్‌ ‌సమావేశానికి వివిధ శాఖల మంత్రులు హాజరు కానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *