- క్యాడర్లో జోష్ నింపుతున్న బీజేపీ అగ్రనేతలు
- వరుస పర్యటనలతో బిజీబిజీ
హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టో
బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఎన్నికల సమాయత్తంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు.. హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో కిషన్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జీల సమావేశం జరగ్గా.. ఎన్నికల వ్యూహాలపై ప్రధానంగా చర్చించారు. ఎన్నికల రూట్ మ్యాప్ ఖరారుపై నేతలకు పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ఎల్.సంతోష్, సునీల్ బన్సల్ దిశానిర్దేశం చేశారు.
ఇదే సమయంలో.. ఈ నెల 10న తెలంగాణకు రాబోతున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్షా. ఈ సందర్భంగా.. ఒకే రోజు రెండు బహిరంగ సభలు నిర్వహించాలని బీజేపీ నేతలు నిర్ణయించారు.10న ఉదయం ఆదిలాబాద్ జిల్లాలో అమిత్షా సభ నిర్వహించనుండగా.. సాయంత్రం రాజేంద్రనగర్ నియోజకవర్గంలో భారీ సభకు ప్లాన్ చేస్తున్నారు. బండ్లగూడ పరిధిలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. మొత్తంగా.. అధికారమే లక్ష్యంగా తెలంగాణలో.. బీజేపీ జాతీయ నాయకత్వం దండయాత్రకు సిద్ధం కావడంతోపాటు.. అగ్ర నేతల పర్యటనలతో బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంటోంది.





