“ఫిరాయింపు ఎంఎల్యేలు ఏ పార్టీలో కొనసాగుతున్నారంటూ వస్తున్న విమర్శలకు ఈ తీర్పు సమాధానమైంది. అంతేగాక త్రిశంఖు స్వర్గంలో కొనసాగుతున్న ఆ పదిమంది ఎంఎల్యేలకు ఊరట లభించినట్లైంది. అలాగే తమకు మద్దతుగానిలిచిన పదిమంది ఎంఎల్యేలను కాపాడుకునే విషయంలో ఇంతకాలం మల్లగుల్లాలు పడుతున్న కాంగ్రెస్ పార్టీకి కూడా ఉపశమనం లభించినట్లైంది. కాగా తెలంగాణ రాజకీయాల్లో ఇదొక కొత్తమలుపుకు దారితీసింది..“
“ఫిరాయింపు ఎంఎల్యేలు ఏ పార్టీలో కొనసాగుతున్నారంటూ వస్తున్న విమర్శలకు ఈ తీర్పు సమాధానమైంది. అంతేగాక త్రిశంఖు స్వర్గంలో కొనసాగుతున్న ఆ పదిమంది ఎంఎల్యేలకు ఊరట లభించినట్లైంది. అలాగే తమకు మద్దతుగానిలిచిన పదిమంది ఎంఎల్యేలను కాపాడుకునే విషయంలో ఇంతకాలం మల్లగుల్లాలు పడుతున్న కాంగ్రెస్ పార్టీకి కూడా ఉపశమనం లభించినట్లైంది. కాగా తెలంగాణ రాజకీయాల్లో ఇదొక కొత్తమలుపుకు దారితీసింది..” సుప్రీం తీర్పు తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో దేశ అత్యున్నత న్యాయస్థానం రాష్ట్ర స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించడం పలువురి ఆశ్చర్యపర్చింది. ఈ కేసుకు సంబంధించి స్పీకర్ తుది నిర్ణయం తీసుకున్నందున ఇక దీనిపై విచారించాల్సిన అవసరంలేదని సుప్రీంకోర్టు అభిప్రాపడింది. అలాగే తన తీర్పుకాపీలను రెండు రోజుల్లో ఫిర్యాదుదారుకు ఇవ్వాలనికూడా కోర్టు స్పీకర్‌కు సూచించింది. దీంతో ఇంతకాలంగా రాజకీయ వర్గాల్లో ఉన్న ఉత్కంఠకు తెరపడినట్లైంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో కొనసాగుతున్నారంటూ వస్తున్న విమర్శలకు ఈ తీర్పు సమాధానమైంది. అంతేగాక త్రిశంఖు స్వర్గంలో కొనసాగుతున్న ఆ పదిమంది ఎమ్మెల్యేల కు ఊరట లభించినట్లైంది. అలాగే తమకు మద్దతుగానిలిచిన పదిమంది ఎంఎల్యేలను కాపాడుకునే విషయంలో ఇంతకాలం మల్లగుల్లాలు పడుతున్న కాంగ్రెస్ పార్టీకి కూడా ఉపశమనం లభించినట్లైంది. కాగా తెలంగాణ రాజకీయాల్లో ఇదొక కొత్తమలుపుకు దారితీసింది.భవిష్యత్‌లో ఫిరాయింపుదారుల విచ్చలవిడితనానికి మార్గం సులభం చేసినట్లుగా భావించాల్సి వస్తుందంటున్నారు. రాజ్యాంగం, నిబంధనలు, చట్టాలు, ప్రత్యక్ష ఎవిడెన్స్‌లేవీ స్పీకర్ తీర్పుకు దిగతుడుపే అన్నది దీనివల్ల స్పష్టమవుతుందంటున్నారు. పరిస్థితి కండ్లకు కట్టినట్లు కనిపిస్తున్నా అదంతా మిథ్య అన్నట్లుంది స్పీకర్ తీసుకున్న నిర్ణయం. గత ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌పార్టీ గుర్తుమీద గెలిచిన పదిమంది ఎంఎల్యేలు బహిరంగంగా కాంగ్రెస్‌పార్టీ కండువ కప్పుకున్న విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ ప్రత్యక్షంగా చూశారు. కాని, పార్టీ ఫిరాయించిన ఎంఎల్‌ఏలు మాత్రం తాము బిఆర్‌ఎస్ పార్టీలోనే ఉన్నామని, తాము కప్పుకున్నది కాంగ్రెస్ కండువకాదు, దేవస్థానానికి సంబంధించిన వస్త్రంగా వారు పేర్కొంటూ వచ్చారు. తమ నియోజకవర్గ అభివృద్ధి నిధులు, పథకాల విషయంలో రాష్ట్రముఖ్యమంత్రిని కలిసినప్పుడు మర్యాదపూర్వకంగా తమకు కండువ కప్పారంతే అంటూ సమర్థించుకుంటున్న వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బిఆర్‌ఎస్, బిజెపి పార్టీలు సుప్రీంకోర్టు తలుపులు తట్టాయి. సుప్రీంకోర్టు దీనిపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశించింది. అందుకు నిర్ణీత గడువు కూడా విధించింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ దీనిపైన చేయాల్సినంత తాత్సర్యంచేసి, చివరకు విడుతలవారిగా పదిమంది ఎంఎల్యేలను విచారిస్తూ, ఒక్కొక్కరికీ క్లీన్ చిట్ ఇస్తూ వచ్చారు. చివరి విడుతగా దానం నాగేందర్, కడియం శ్రీహరిని విచారించి, వారు బిఆర్‌ఎస్ ఎంఎల్యేలేనని తాజాగా తేల్చేశారు. దీనిపై రాజకీయ వర్గాలు భగ్గుమంటున్నాయి . ఏ పార్టీకి మొగ్గు చూపకుండా న్యాయంగా వ్యవహరించాల్సిన స్పీకర్ తనస్థానాన్ని అవమానించడమేనంటూ ఆ వర్గాలు ఆరోపిస్తున్నాయి. పార్టీ ఫిరాయించిన పదిమంది ఎంఎల్యేల్లో కడియం శ్రీహరి, దానం నాగేందర్‌కు సంబంధించి పక్కా ఆధారాలు ఉండడంతో కనీసం వీరిద్దరిపైనైనా వేటు పడక తప్పదనుకున్నారు.
దీంతో ఈ రెండుచోట్ల ఉప ఎన్నికలు తప్పదన్న అభిప్రాయం దాదాపు అన్నీ రాజకీయ వర్గాల్లో ఉండింది. కాని స్పీకర్ గడ్డం ప్రసాద్ వారి ఆలోచనలకు భిన్నమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఇద్దరుకూడా బిఆర్‌ఎస్ ఎంఎల్యేలన్న విషయం తన విచారణలో తేలిందని బుధవారం చావు కబురు చల్లగా చెప్పారు. స్పీకర్ నిర్ణయాన్ని సంబంధిత న్యాయవాదులు ఉన్నతన్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్ళడం ఇక తాము ఇందులో విచారించేదిలేదని న్యాయస్థానం కేసు మూసేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో విపక్షాలు తీవ్రంగా రగిలిపోతున్నాయి. భారత రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్‌ల్లో ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం, ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి వెళ్తే అనర్హత వేటు పడాలి. అయితే స్పీకర్ తాజా నిర్ణయం ఫిరాయింపుల చట్టంలోని లొసుగులను బహిర్ఘతం చేస్తున్నట్లైంది. ఇదిప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో ముఖ్యంగా బిఆర్‌ఎస్ భగ్గు మంటోంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కెటి రామారావు దీనిపైన తీవ్రంగా స్పందించారు. చివరి ఇద్దరు ఎంఎల్యేలు బిఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారనడానికి ఫోటోలు, వీడియోలేకాకుండా కాంగ్రెస్ పక్షాన ప్రచారం చేసిన దాఖలాలున్నా స్పీకర్ వాటన్నిటిని తోసి వారికి క్లీన్ చిట్ ఇవ్వడమన్నది ప్రజాస్వామ్య చరిత్రలోనే చీకటిరోజుగా ఆయన అభివర్ణించారు.
ఇది రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా ఇచ్చిన తీర్పుకాదు, ఏకపక్షంగా అనుకూల వర్గానికి అనుకూలంగా ఇచ్చిన తీర్పు అంటూ ఆయన ఘాటైన విమర్శచేశారు. కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్య విలువలు మంటకలిశాయని, ఇది దుర్మార్గపాలనకు నిదర్శనమని భారతీయ జనతాపార్టీ నాయకులు ధ్వజమెత్తారు . స్పీకర్ నిర్ణయం ముమ్మాటికీ రాజ్యాంగ ఉల్లంఘననేనని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనడానికి ఇలాంటి నిర్ణయాలు చెప్పకనే చెబుతున్నాయని ఆవేదన వ్యక్తంచేయగ, ఇది ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కటమేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పేర్కొన్నారు. దీనిపై తమ పార్టీ న్యాయపోరాటం చేస్తుందంటున్నారు ఆ నాయకులు. ఇదిలాఉంటే బిఆర్‌ఎస్‌లోనే ఉన్నప్పటికీ ఇటీవల జరిగిన బిఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశానికి తనను పిలవకపోవడాన్ని దానం నాగేందర్ ఎత్తి చూపుతే, తాను పార్టీలో ఉన్నా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నానని, అయితే బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 36 మంది ఎంఎల్యేలను పార్టీలో చేర్చుకున్న విషయాన్ని గుర్తుచేస్తూ, దానిపై కెసిఆర్ క్షమాపణ చెబితే తాను రాజీనామాకు సిద్దమని కడియం శ్రీహరి మరో ట్విస్ట్ ఇచ్చారు.





