హైదరాబాద్‌ ‌సహా పలు ప్రాంతాల్లో వర్షం

వికారాబాద్‌ ‌జిల్లాలో వాగు ప్రవాహానికి కొట్టుకు పోయిన కారు…చెట్టు అడ్డురావడంతో ప్రాణాలు దక్కించుకున్న దంపతులు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 6 : అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌ ‌పాటు పలు జిల్లాల్లో వర్షం పడుతుంది. హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం పడింది. వరుసగా రెండో రోజు వర్షం పడింది. ఆకాశం మేఘావృతమై గురువారం ఉదయం నుంచే ముసురు పడింది. ఇక బుధవారం దసరా రోజు కూడా పలుచోట్ల జోరువాన కురిసింది. అంబర్‌పేట, ముసారంబాగ్‌, ‌మలక్‌పేటలో భారీ వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. చంపాపేట్‌, ఐఎస్‌ ‌సదన్‌, ‌సంతోష్‌నగర్‌, ‌సైదాబాద్‌, ‌చాదర్‌ఘాట్‌, ‌కోఠిలో భారీ వర్షం పడింది. బంజారాహిల్స్, ‌జూబ్లీహిల్స్, ‌మాదాపూర్‌లో భారీగా వర్షం పడడంతో రోడ్లపైకి వర్షపు నీరు రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నగరంలో దసరా రోజు సాయంత్రం వెదర్‌ ఒక్కసారిగా మారిపోయింది.

దీంతో ఉప్పల్‌, ‌పీర్జాది గూడ, తార్నాక, రాజేంద్ర నగర్‌, ‌మైలార్‌ ‌దేవ్‌ ‌పల్లి, అత్తాపూర్‌, ‌బండ్లగూడ జాగీర్‌, ‌కిస్మత్‌ ‌పూర్‌, ‌హిమాయత్‌ ‌సాగర్‌, ‌నార్సింగి, మణికొండ, పుపాల్‌ ‌గూడ, గండిపేట తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఆ ప్రాంతాల్లోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. భారీగా వర్షం కురవడంతో ఉప్పల్‌ ఏరియాలోని పీర్జాదిగూడ మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌పరిధిలోని బండి గార్డెన్స్ ‌లైన్‌లో రోడ్లు చెరువులను తలపించాయి. రోడ్డుపై వెళ్తున్న స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. కొద్దిపాటి వర్షానికే రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడం, ఇండ్లలోకి వరదనీరు వొచ్చి చేరుతుందని వాపోతున్నారు. వర్షం కురిసిన ప్రతిసారీ ఇలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయని చెబుతున్నారు. వరదనీటిలో ఇబ్బందులు పడుతున్నా స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు.

వికారాబాద్‌ ‌జిల్లాలో వాగు ప్రవాహానికి కొట్టుకు పోయిన కారు…చెట్టు అడ్డురావడంతో ప్రాణాలు దక్కించుకున్న దంపతులు
ఉమ్మడి మహబూబ్‌నగర్‌, ‌వికారాబాద్‌ ‌జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వికారాబాద్‌ ‌జిల్లా ధారూరు మండల పరిధిలోని నాగారం గ్రామ సవి•పం వద్ద దోర్నాల గ్రామానికి చెందిన దంపతులు ప్రయాణిస్తున్న కారు వాగు ప్రవాహానికి కొద్దిదూరం వరకు కొట్టుకు పోయింది. డ్రైవర్‌ ‌వాగు ప్రవాహాన్ని గమనించకుండా ముందుకు తీసుకెళ్లడంతో ప్రవాహానికి కారు కొట్టుకుపోయి గట్టు వద్ద ఉన్న చెట్టు అడ్డురావడంతో వారు ప్రాణాలతో బయట పడ్డారు. కారు నీటిలో మునిగిపోగా భార్యభర్తలు కారునుంచి బయటకు వొచ్చి ఎత్తయిన కొమ్మల సహాయంతో చెట్టుపైకి ఎక్కి ప్రాణాలు దక్కించుకున్నారు. వర్షం వల్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *