హైదరాబాద్‌ ‌శివారు బండ్లగూడలో విషాదం

  • కారు ఢీకొనడంతో మార్నింగ్‌ ‌వాక్‌
  • చేస్తున్న ముగ్గురు మహిళలు మృతి
  • మృతుల్లో తల్లీకూతుళ్లు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 4 : కారు ఢీకొట్టడంతో మార్నింగ్‌ ‌వాక్‌కు వెళుతున్న తల్లి కూతురుతో పాటు మరో మహిళ మృతి చెందారు. ఈ ఘటన మంగళవారం హైదరాబాద్‌ ‌శివా రు బండ్లగూడలో జరిగింది. బండ్లగూడ జాగీర్‌ ‌సన్‌ ‌సిటీ వద్ద మార్నింగ్‌ ‌వాక్‌కు వెళుతున్న నలు గురిని కారు ఢీకొట్టగా ప్రమాదంలో తల్లీకుమార్తె మృతిచెందగా మరో ఇద్దరు మహిళలకు గాయాల య్యాయి. గమనించిన స్థానికులు వెంటనే గాయపడిన మహిళలను హాస్పిటల్‌కి తరలించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. మృతులను అనురాధ (38), మమత (26)గా గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.

తల్లీకూతురు కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మార్నింగ్‌ ‌వాక్‌ ‌చేస్తుండగా.. ఎక్కడి నుంచి వొచ్చిందో కానీ కారు.. మృత్యు రూపంలో వెంటాడి తల్లీకూతుళ్లతో పాటు మరో మహిళ ఉసురు తీసింది. బండ్లగూడ జాగిర్‌ ‌కార్పొరేషన్‌ ‌పరిధిలోని హైదర్‌ ‌షాకోట్‌ ‌ప్రధాన రహదారిపై ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా..ఏడుగురికి గాయాలు అయ్యాయి. మృతుల్లో తల్లీకూతుళ్లతో పాటు మరో మహిళ ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. అక్కడి పరిస్థితి భయానకంగా మారింది. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్‌మార్టానికి తరలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *