*హైదరాబాద్ లో అంబటి నివాళి*

  • సోషల్‌ ‌మీడియాలో తులసి చంద్‌ ‌మీద దాడిపై ఎపి మీడియా సలహాదారు దేవులపల్లి అమర్‌
  • ‌జర్నలిస్టులపై ఒత్తిడి వొస్తే అందరూ ఎదుర్కునాలి : సీనియర్‌ ‌పాత్రికేయులు రామచంద్ర మూర్తి
  • వ్యక్తిగతంగా గిట్టని వాళ్లే కామెంట్‌ ‌చేస్తారు : ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ ‌శ్రీనివాస్‌
  • దళిత, మైనార్టీ, మహిళలపై దాడులు : ప్రొఫెసర్‌ ‌హరగోపాల్‌
  • ‌టియుడబ్ల్యూజే ఆధ్వర్యంలో రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశం

ఖైరతాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 27 : ఇం‌డిపెండెంట్‌ ‌జర్నలిజం మీద జరుగుతున్న దాడే జర్నలిస్ట్ ‌తులసి చంద్‌ ‌మీద జరుగుతున్న దాడి అని ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్‌ అన్నారు. ఇండిపెండెంట్‌ ‌జర్నలిజం నచ్చని వ్యక్తులే ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. ఈ మేరకు మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌ ‌క్లబ్‌లో జర్నలిస్టు తులసి చంద్‌పై సోషల్‌ ‌మీడియాలో దాడి జరుగుతున్న నేపథ్యంలో ‘జర్నలిజం-ట్రోల్‌ ‌ముఠాలు’ అనే అంశంపై రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశం టియుడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరహత్‌ అలీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన దేవులపల్లి అమర్‌ ‌మాట్లాడుతూ…జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు ఇవాళ కొత్త కాదని, ఇంతటితో ఆగిపోదని ఆయన అన్నారు. తులసికి అండగా అందరు నిలబడాలని పిలుపునిచ్చారు. సోషల్‌ ‌మీడియా వొచ్చిన తర్వాత ఇండిపెండెంట్‌ ‌జర్నలిజం అనేది చాలా బలంగా ప్రాచుర్యం పొందిందని ఆయన అన్నారు. తన 45 ఏళ్ల జర్నలిజం వృత్తిలో ఇటీవల కలంలో ఎన్నో మార్పులు వొచ్చినట్లు గమనించానని చెప్పారు.

గతంలో వార్తలు రాస్తే ఒక సమస్యపై కానీ వ్యక్తులకు వ్యతిరేకంగా రాస్తే యజమాన్యానికి కానీ, సంపాదకులను కానీ సంప్రదించి ఇది రాయడం సరికాదని చెప్పేవారని అన్నారు. సుప్రసిద్ధ పాత్రికేయులు రామచంద్ర మూర్తి మాట్లాడుతూ…పెద్దల అండదండలతో కొందరు జర్నలిస్టులను భయపెట్టే పనిలో ఉన్నారన్నారు. సమాజంలో సోషల్‌ ‌మీడియా పాపులారిటీ పెరిగిందన్నారు. తెగించి బతికేవాడు సమాజంలో కొన్ని రోజులు బతుకుతాడని అన్నారు. గతంలో ఇందిరా గాంధీని కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్‌ ‌రాష్ట్రలలో తప్ప అన్ని రాష్ట్రాలలో ఓడించారన్నారు. జర్నలిస్టులపై ఒత్తిడి వొస్తే అందరూ ఎదుర్కునడానికి సిద్ధంగా ఉండాలన్నారు. జర్నలిస్టు తులసి చందుకు తన మద్దతు పూర్తిగా ఉంటుందన్నారు. ప్రొఫెసర్‌ ‌హరగోపాల్‌ ‌మాట్లాడుతూ…సమాజంలో దళిత, మైనార్టీ, మహిళలపై దాడులు జరుగుతున్నాయన్నారు. సమాజంలో నైతిక విలువలు క్షీణిస్తున్నాయన్నారు.

తులసి మీద కాదు మహిళలపైన దాడి జరిగినట్లని అన్నారు. మతం పేరు మీద దాడులు తగవని, మతం అంటే విశ్వాసం కదా అన్నారు. తులిసికి పౌరహక్కుల సంఘాలు, ప్రజాసంఘాలలు మద్దతు ఉన్నాయన్నారు. ఉప చట్టంపై జూలై 1న రౌండ్‌ ‌టేబుల్‌ ‌మీటింగ్‌ ఉం‌టుందన్నారు. ఆంధ్రజ్యోతి సంపదకులు శ్రీనివాస్‌ ‌మాట్లాడుతూ…వ్యక్తిగతంగా గిట్టని వాళ్లు కామెంట్‌ ‌చేస్తారని, ట్రోల్‌ ‌ముఠాలు కొత్తవి కావన్నారు. వ్యవస్థను నిరోధించడం కష్టం అన్నారు. ప్రభుత్వ యంత్రాంగమే అలాంటి వాళ్లను పెంచి పోషిస్తుందన్నారు. సామాజీక కార్యకర్త సజయ మాట్లాడుతూ తెలంగాణలో కొట్లదిన చాకలి ఐలమ్మ వారసులం అన్నారు. సీనియర్‌ ‌జర్నలిస్ట్, ‌పాశం యాదగిరి మాట్లాడుతూ…ప్రజల వాయిస్‌ ఓన్లీ సోషల్‌ ‌మీడియాలో వినిపిస్తుందన్నారు. గతంలో ఎంతో మంది విలేఖరులపై దాడులు జరిగాయని, ఇంక ముందు కూడా జరగబోతాయన్నారు. పౌర సమాజం కాపాడడానికి మరో సమావేశం ఏర్పాటు చేసుకోవాలన్నారు. హరగోపాల్‌ ‌పై ఉపా కేసులు పెట్టారన్నారు. సమాజంలో తులసి చందు సావిత్రిబాయి పూలే అయిందన్నారు. సంధ్య మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వొచ్చినప్పిటి నుండి ట్రోల్‌ ‌ముఠాల దాడులు పెరిగాయన్నారు.

తనమీద ఎన్నో ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ముస్లింలు చంపితే మతం మారి పూజారి చంపితే ఎక్కడ మాట్లాడారన్నారు. ముస్లిమ్‌ ‌చేతుల్లో చనిపోయిన నాగరాజ్‌ ‌కోసం బిజెపి నేతలు మర్పల్లి గ్రామానికి వొచ్చారన్నారు. ఈ దేశంలో ఎందుకు పుట్టాను అని సిగ్గుపడుతున్నా అన్నారు. బాధిత జర్నలిస్ట్ ‌తులసి చంద్‌ ‌మాట్లాడుతూ…ప్రశ్నిస్తే జర్నలిస్టుల గొంతులను మతవాదంతో తొక్కే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. హిందూ సమాజానికి వ్యతిరేకమని తనపై ముద్ర వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వార్తలు సృష్టించి చేయడం లేదని, కుటుంబ సపోర్టుతో జర్నలిజం చేస్తున్నానని అన్నారు. ఆర్బన్‌ ‌నక్సలైట్‌గా తనపై ముద్ర వేసి లేని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తనపై దాడి చేస్తున్న మూడు యూట్యూబ్‌ ‌ఛానల్స్ ‌పై ఒక ఫేస్బుక్‌ ‌పై కేసు పెట్టినట్లు తెలిపారు. జర్నలిస్టుగా ప్రశ్నించే హక్కు మనకుంటుందన్నారు.

ప్రశ్నించే జర్నలిస్టుల పైన దాడులు చేస్తే మనమంతా ఏకం కావాలన్నారు. తాను పోస్ట్ ‌చేసే వీడియోలకు అనేక కామెంట్లు ఉంటాయని, తనకు అనుకూలంగా ఉండవన్నారు. బిజెపి పార్టీ కానీ పీఎంకు వ్యతిరేకంగా పోస్ట్ ‌చేస్తే అనేక కామెంట్లు తనపై పెడుతున్నారని అన్నారు. సమాజానికి మేలు చేస్తున్న ఫీలింగ్‌ ‌తనకు లేదని ఇది తాను బతకడానికి ఎంచుకున్న వృత్తి అన్నారు. తెలంగాణ రచయితల వేదిక సభ్యులు వెలిశెట్టి శంకర్‌ ‌మాట్లాడుతూ..రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు మరెన్నో ఎదుర్కునాల్సి వొస్తుందన్నారు. తెలంగాణ విద్యావంతుల వేదిక సభ్యులు నాగయ్య మాట్లాడుతూ…పాలకవర్గాలు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ స్త్రీ వ్యతిరేకం అన్నారు. తెలంగాణలో లక్ష సీసీ కెమెరాలు ఉన్నాయని గొప్ప చెప్పుకుంటున్నారని ఒక దోషిని పట్టుకోలేరా అని ప్రశ్నించారు. తెలంగాణలో జర్నలిస్టులకు సెక్యూరిటీ లేకపోతే సామాన్య మనిషి ఎట్ల బతుకుతాడని అన్నారు. ఈ సమావేశంలో సీనియర్‌ ‌జర్నలిస్ట్ ‌వనిజ, వీక్షణం సంపాదకులు వేణు గోపాల్‌, ‌తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *