హైదరాబాద్‌ తొలి మేయర్‌ మాస్టర్‌ ప్లానర్‌ కొర్వి కృష్ణస్వామి

నేడు వర్ధంతి

కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్‌. ఈ పేరు చాలామంది విని ఉండక పోవచ్చు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయనకు సంబంధించి ఒక రంగం గురించి చెప్పి, మిగిలిన వాటిని చులకన చేస్తే అది ఆత్మ ఆత్మ ద్రోహము అవుతుంది. ఆయన స్పృశించని అంశం లేదు. కాలూనని రంగం లేదు. ఏ అంశంలో లోతుగా అధ్య యనం చేసినా, అది పి. హెచ్‌. డి. సంపాదించి పెడుతుంది. రాజకీయ నాయకునిగా, హైదరాబాద్‌ మేయర్‌ గా, సిటీ మాస్టర్‌ ప్లానర్‌ గా, బి.సి. సంఘాల స్థాపకునిగా, జర్నలిస్టుగా, సంపాదకునిగా, ముదిరాజ్‌ కుల బాంధవునిగా, పాఠశాలల స్థాపకునిగా, హిందీ భాష ప్రోత్సాహకునిగా, యాదగిరి దేవస్థాన ధర్మకర్తగా, నిజాం రాష్ట్ర విద్యా సహాదారు బోర్డు సభ్యునిగా, ఇలా ఒక్కటేమిటి అడుగిడిన ప్రతి చోటా తనదయిన ముద్ర వేసి, ఆయన అందించిన బహుముఖ సేవలు చిరస్మరణీయ మైనవి. ఆయనే కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్‌ (ఆగష్టు 25, 1893 – డిసెంబర్‌ 19, 1967).

స్వాతంత్య్ర సమర యోధుడిగా, రచయితగా, విద్యావేత్తగా, ప్రభుత్వోద్యోగిగా హైదారాబాద్‌ మేయర్‌గా, ఆంధ్ర మహాసభ నిర్వాహకులుగా, ముదిరాజ్‌ మహాసభ నిర్మాతగా, బహుజన వైతాళికులుగా, పరిపాలనా దక్షులుగా ప్రజల మన్నన  లందు కున్న బహుముఖ ప్రజ్ఞాశాలి కృష్ణస్వామి.తెలంగాణ ఖ్యాతిని ముఖ్యంగా హైదరాబాద్‌ ఉన్నతిని, ప్రాము ఖ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన కృష్ణస్వామి ముదిరాజ్‌ హైదరాబాద్‌లో సామాజిక, రాజకీయ ఉద్యమాలకు ఒకనాడు కేంద్ర బిందువుగా ఉన్నారు. దేశ ‘స్వాతంత్య్రోద్యమ చరిత్ర’ రాసే  ప్యానెల్‌లో కృష్ణస్వామి కూడా సభ్యుడిగా ఉన్నారు.25 ఏళ్ళకు పైగా కౌన్సిలర్‌గా, మేయర్‌గా హైదరాబాద్‌ రాజకీయాలలో రాణించారు. 1955లో డిప్యుటి మేయర్‌గా ఎన్నికయ్యారు. ఈ హోదాలో అనేక కమిటీకు సహాదారుగా పని చేశారు. 1957లో మేయర్‌గా ఎన్నికై, స్వాతంత్య్రానంతర హైద్రాబాద్‌కు మొదటి మేయర్‌ గా పని చేశారు. 1957లో హైదరాబాద్‌ నాలుగో మేయర్‌గా ఎన్నికైన తర్వాత రాబోయే 30 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని నగరాభివృద్ధి కోసం మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేసిన దీర్ఘ దృష్టి ఆయనది.1950లో కొత్తగా హై దరాబాద్‌ మున్సిపల్‌ చట్టాన్ని రూపొందించడంలో కృష్ణస్వామి  కీలక పాత్ర పోషించారు. 1957లో ఉస్మానియా యూనివర్సిటీ సెనేట్‌ సభ్యుడిగా కూడా ఆయన పనిచేశారు.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పొంది,  స్వయంగా ‘చంద్రకాంత ప్రెస్‌’ను నెలకొల్పి, ‘దక్కన్‌ స్టార్‌’ అనే ఆంగ్ల వార పత్రికను స్థాపిం చడమే గాకుండా సమర్థ స్వీయ సంపాదకత్వంలలో  నడిపించారు. కొద్ది కాంలోనే దక్షిణ భారత ప్రెస్‌ లల్లో ప్రముఖ ప్రెస్‌గా పేరు సంపా దించింది. అయన ‘సంపాద కత్వంలో వెలువడిన ‘దక్కన్‌ స్టార్‌’, ఆర్య సమాజ్‌ పత్రిక ‘మసావత్‌’, ‘న్యూ ఎరా’ పత్రికు కూడా చంద్ర కాంత ప్రెస్‌లోనే ముద్రించే బాధ్యత తీసుకున్నారు. 1939లో ‘మసా వత్‌’ అనే ఉర్దూ వార పత్రికకు కూడా సంపాదకులుగా ఉన్నారు.
హైద్రాబాద్‌లో మత సామరస్యం కాపాడడానికి ఆయన చేసిన కృషి కి, నాటి ముస్లిం నేతలు కృష్ణ స్వామిని ‘ఎంబడిమెంట్‌ ఆఫ్‌ సెక్యురిజం’ అని కొనియాడే వారు.

కె.కృష్ణస్వామి, ఆర్‌.కేశమ్‌ సంయుక్త కృషితో 30.9.1922న ‘ముదిరాజ్‌ (ముక్తరాజ) మహా సంఘము, దక్షిణ హైద్రాబాద్‌’ అనే పేరుతో ముదిరాజ్‌  సంఘం స్థాపించ బడగా, 1941లో తుల్జా భవన్‌లో జరిగిన ముదిరాజ్‌ మహా సమ్మేళనంలో కె.కృష్ణస్వామి ముది రాజ్‌ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకో బడ్డారు. అప్పటి నుండి 1961 వరకు నిర్వరామంగా ఈ సంఘానికి అధ్యక్షులుగా పని చేశారు. 1954లో  కృష్ణస్వామి అఖిల భారత ముది రాజ్‌ మహాసభకు అధ్యక్షునిగా ఎన్నుకో బడ్డారు. దీని తర్వాతనే ముదిరాజ్‌ సంఘం ‘ముదిరాజ్‌ మహాసభ’గా మార్చ బడినట్లు చెపుతారు.

సంపాదనపై ఆశ లేక,  ప్రజాసేవే పరమార్థంగా, ఉన్న ఇల్లును కూడా అమ్ముకొని, ప్రజా జీవితంలో మచ్చ లేని జీవితం గడిపారు. హైద్రాబాద్‌ నగర నిర్మాణ చరిత్ర, గోవా రాష్ట్ర స్వాతంత్య్ర ఉద్యమం, ముది రాజు జాతి చరిత్ర, హైద్రాబాద్‌ రాష్ట్ర 30 సంవత్సరా రాజకీయ పోరాటం, హైద్రాబాద్‌ మున్సిపల్‌ పరిపాన వ్యవస్థ చరిత్ర (1280 ఫసలి / క్రీ.శ. 1871 నుండి), నవాబ్‌ దీన్‌ దయాల్‌ జంగ్‌ బహదూర్‌ జీవిత చరిత్ర,  పిక్టోరి యల్‌ హైద్రాబాద్‌ (హైద్రాబాద్‌ రాజవంశ, నవాఋ, జాగిర్దారు చరిత్ర) తదితరాలను వివిధ భాషల్లో రాశారు. ఆయన రాసిన చరిత్ర గ్రంథాల్లో ఒక్కొక్కటి ఒక్కో పిహెచ్‌.డి.పట్టా పొందే అర్హత కలిగి ఉన్నాయి. ఆయన పట్టా లేని పరిశోధకునిగా మిగిలి పోయారు.

 -రామకిష్టయ్య సంగనభట్ల
9440595494

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *