హైదరాబాద్‌ ఓ ‌మంచి డెస్టినేషన్‌

– ఓపెన్‌ ఏఐ ‌సీఈఓ సామ్‌ ఆల్ట్‌మన్‌కి కెటిఆర్‌ ఆఫర్‌

‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్ 23: ఓపెన్‌ ఏఐ ‌తన కార్యకలాపాలను హైదరాబాద్‌లో ప్రారంభించాలని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ’ఎక్స్’ ‌వేదికగా కోరారు. ఇటీవల ఆ కంపెనీ సీఈవో శామ్‌ అల్ట్‌మన్‌ ‌భారత్‌లో కార్యాలయం ఏర్పాటు చేస్తామని తెలిపారు. సెప్టెంబర్‌లో ఇక్కడ పర్యటిస్తామన్నారు. ఈక్రమంలో కేటీఆర్‌ ఆయనకు స్వాగతం పలికారు. భారత్‌కు హైదరాబాద్‌ను గేట్‌వేగా అభివర్ణించారు. ఓపెన్‌ ఏఐ ‌లాంటి సంస్థలకు ఆదర్శవంతమైన కేంద్రమని పేర్కొన్నారు. తన కార్యకలాపాలు ప్రారంభించడానికి హైదరాబాద్‌లో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని  కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ ‌నుంచి భారతదేశ కార్యకలాపాలను ప్రారంభించాలని ఓపెన్‌ ఏఐ ‌సీఈఓ సామ్‌ ఆల్ట్‌మన్‌కి ఆయన విజ్ఞప్తి చేశారు. భారత దేశంలో త్వరలో కార్యాలయం ఏర్పాటు చేస్తామని చెప్పిన క్షూ।ఆఒ ఈఊక్ష సామ్‌ ఆల్ట్‌మన్‌కి హైదరాబాద్‌ ‌నుంచి కంపెనీ కార్యకలాపాలు ఏర్పాటు చేయాలని ఎక్స్ ‌వేదికగా కేటీఆర్‌ ‌కోరారు. వచ్చేనెల భారత్‌లో పర్యటిస్తున్నానని తెలిపిన సామ్‌ ఆల్ట్‌మన్‌కి హైదరాబాద్‌ ‌నగరానికి కేటీఆర్‌ ‌స్వాగతం పలికారు. హైదరాబాద్‌ను భారతదేశానికి సరైన ప్రవేశ ద్వారంగా,అలాంటి సంస్థలకు ఆదర్శవంతమైన కేంద్రంగా అభివర్ణించారు. ఈ నగరం భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన ఇన్నోవేషన్‌ ‌పర్యావరణ వ్యవస్థను కలిగి ఉందని, తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ ‌సెల్‌, ‌రీసెర్చ్ అం‌డ్‌ ఇన్నోవేషన్‌ ‌సర్కిల్‌ ఆఫ్‌ ‌హైదరాబాద్‌ ‌వంటివి ఉన్నాయని చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌ ఇప్పటికే మైక్రోసాప్ట్, ‌గూగుల్‌, అమెజాన్‌, ‌మెటా, ఆపిల్‌, ‌క్వాల్‌కామ్‌ ‌లాంటి అనేక గ్లోబల్‌ ‌టెక్‌ ‌దిగ్గజాలకు కేంద్రంగా మారిందని, ఇక్కడ సాంకేతిక, స్టార్టప్‌ ‌రంగాలలో అపారమైన ప్రతిభ ఉందని ఆయన పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంగా తెలంగాణ ప్రభుత్వం, భారతదేశానికి ఆఒ రాజధానిగా రాష్ట్రం మారడానికి అనేక సాహసోపేతమైన చర్యలు తీసుకుందని వివరించారు.


 

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండిరగ్‌ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్‌ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్‌ చానల్‌ను సబ్‌ స్క్రైబ్‌ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్‌ చేయడం మరిచిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *