మంగళవారం హైదరాబాద్‌కు ప్రత్యేక ఎయిర్‌ఫోర్స్ విమానంలో హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు హాకీంపేట్ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. అక్కడ ఆమెకు రెడ్‌కార్పెట్ వెల్కమ్‌తో పుష్పగుచ్ఛం ఇచ్చి అభివాదం చేశారు. రాష్ట్రపతికి గవర్నర్ తమిళి సై సౌందరరాజన్, సీఎం కేసీఆర్‌తో పాటు సీఎస్ శాంతికుమారి, తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా రాష్ట్రపతి ముర్ముకు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. గచ్చిబౌలి స్టేడియంలో జరుగనున్న అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ముగింపు ఉత్సవాల్లో ఆమె పాల్గొంటారు.
– ప్రజాతంత్ర , హైదరాబాద్



