స్వాగతం పలికిన గవర్నర్, సిఎం, మంత్రులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 18 : శీతాకాలపు విడిదికిగాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం హైదరాబాద్కు చేరుకున్నారు. రాష్ట్రపతికి బేగంపేట విమానాశ్రయంలో గవర్నర్ తమిళి సై సౌందర రాజన్, సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, అధికారులు స్వాగతం పలికారు. రాష్ట్రపతి 23 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి భవన్లో బస చేయనున్నారు.




