ముషీరాబాద్, ప్రజాతంత్ర, జూలై 17 : ఫెడరేషన్ క్యాలెండర్‌లో భాగంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే ర్యాంకింగ్ ఈవెంట్‌కు అగ్రశ్రేణి జాతీయ సెయిలర్లు హాజరు కాబోతున్న 14వ ఎడిషన్ మాన్ సూన్ రెగట్టా జూలై 18న రేసింగ్ తో ప్రారంభం కానుంది. మాన్‌సూన్ రెగట్టా రోలింగ్ ట్రోఫీ, ప్రతిష్టాత్మకమైన ఎస్ఎహ్ బాబు మెమోరియల్ ట్రోఫీలు ఉత్తమ నావికుని అన్వేషించటంతో పాటుగా బాలురు, బాలికల కోసం అనేక పతకాలు అందించ నున్నాయి. ఈ మాన్‌సూన్ రెగట్టాలో తొలిసారిగా అండర్ 19 ఇంటర్నేషనల్ 420 మిక్స్‌డ్ క్లాస్‌ని పరిచయం చేయడంతో ప్రత్యేకంగా మారింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ స్థాయిలో లింగ సమానత్వం యొక్క వ్యక్తీకరణ, అంతర్జాతీయ ఫెడరేషన్ యొక్క వరల్డ్ సెయిలింగ్ విధానాలకు ప్రతిబింబం. టాప్ సీడ్‌లు హైదరాబాద్‌లోని యాచ్ క్లబ్‌కు చెందిన ధరణి లావేటి, నేవీ బాయ్ స్పోర్ట్స్ స్కూల్ గోవాకు చెందిన వడ్ల మల్లేష్ ఇటీవల హుస్సేన్ సాగర్లో జరిగిన 420 ఓపెన్ ఈవెంట్‌ను గెలుచుకున్నారు. వీరి తర్వాత నాన్సీ రాయ్, భోపాల్‌కు చెందిన అనిరాజ్ సెంధవ్ ఉన్నారు. అండర్ 15 సబ్ జూనియర్స్‌లో ఎన్ఎస్ఎస్ భోపాల్‌కు చెందిన ఏకలవ్య బాతం అజేయంగా కనిపించాడు. రెండు ట్రోఫీలను గెలుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అతను గత సంవత్సరం ఎస్.హెచ్ బాబు మెమోరియల్ యొక్క 1వ ఎడిషన్‌ను గెలుచుకున్నాడు. ఇది ఎస్.టి.ఎస్ ప్రసాద్ తన తండ్రి ఎస్.హె.చ్ బాబు జ్ఞాపకార్థం స్థాపించిన ట్రోఫీ అని, దురదృష్టవశాత్తు మొదటి విజేతకు తన తండ్రి పేరు మీద ట్రోఫీని అందజేయకముందే ఆయన మరణించారు. బాలికలలో టాప్ సీడ్‌లు స్థానిక బాలికలు రసూల్‌పురా దీక్షిత, ఉద్భవ్ స్కూల్‌కు చెందిన కొమరవెల్లి, ఆమె సోదరి లాహిరి ఉన్నారు. మాన్‌సూన్ రెగట్టాకు మలేషియాకు చెందిన లియోనార్డ్ చిన్ అధ్యక్షతన ఇజ్రాయెల్‌కు చెందిన రాన్ యాఫే, భారత దేశానికి చెందిన కల్నల్ కన్వర్‌తో కూడిన అంతర్జాతీయ జ్యూరీ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తారు. సబ్ జూనియర్స్‌లో జరిగే టీమ్ రేసింగ్ ఈవెంట్‌కు భారత కెప్టెన్ అభిమన్యు పాటంకర్ చీఫ్ అంపైర్‌గా వ్యవహరిస్తారు. భోపాల్, మైసూర్, గోవా, చెన్నై నుండి ఎంట్రీలు వచ్చాయి.



