యూపిలో కఠినంగా నిబంధనలు అమలు
లక్నో,అగస్ట్09: యూపి అసెంబ్లీలో హుందాగా కార్యక్రమాలు నడిపించేందుకు పలు నిబంధనలు అమల్లోకి తీసుకుని వచ్చారు. అన్ని అసెంబ్లీల్లో ఈ నిబంధనలు ఉన్నా అమలు కావడం లేదు. సభలు గాడి తప్పడంతో యూపి అసెంబ్లీ కఠిన నిర్ణయాలకు సిద్దమయ్యింది. ఈ మేరకు సభలో బిగ్గరగా నవ్వరాదు. పత్రాలు చించకూడదు. మొబైల్ ఫోన్లు తీసుకురావద్దు. స్పీకర్‌కు వెన్ను చూపేలా నిల్చోవడం లేదా కూర్చోవడం చేయరాదు. ఉత్తరప్రదేశ్ శాసనసభ విధివిధానాలు, సభలో ప్రవర్తనకు సంబంధించిన కొత్త నియమాల బిల్లు 2023ను సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బుధవారం చర్చ జరిపిన తర్వాత ఈ బిల్లును ఆమోదించనున్నట్లు యూపీ అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా తెలిపారు.
కాగా, కొత్త నిబంధనల ప్రకారం, శాసనసభ్యులు సభలో ఎలాంటి పత్రాలను చించే వీలుం డదు. అలాగే వారు మాట్లాడు తున్నప్పుడు గ్యాలరీలో ఎవరి వైపైనా చూడటం లేదా ప్రశంసించడం చేయకూ డదు. సభ్యులు వంగి స్పీకర్ స్థానాన్ని గౌరవించాలి. ఎమ్మెల్యేలు సభలోకి ప్రవేశించేటప్పుడు లేదా బయటకు వెళ్లేట ప్పుడు లేదా కూర్చున్నప్పుడు లేదా వారి సీట్ల నుంచి లేచేప్పుడు స్పీకర్‌కు వీపు చూపకూ డదు.అలాగే సభలోకి ఆయు ధాలు తీసుకు రావడం లేదా ప్రదర్శిం చడం నిషేధం. సభ్యులు లాబీలో పొగతా గరాదు. బిగ్గరగా మాట్లాడటం లేదా నవ్వడం చేయకూడదు. మరోవైపు కొత్త నిబంధనల ప్రకారం ఉత్త• •ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల వ్యవధిని ప్రస్తుతం ఉన్న 14 రోజుల నుంచి ఏడు రోజులకు అంటే సగానికి తగ్గించ నున్నా రు. అలాగే సభ్యులు ఎటువంటి సాహిత్యం, ప్రశ్నాపత్రం, పుస్తకం లేదా పత్రికా వ్యాఖ్యలను సభలోకి తీసుకురా కూడదు. ప్రొసీడింగ్‌లకు సంబం ధించిన స్లిప్పులను పంపిణీ చేయడానికి అనుమతి ంచరు. అలాగే ఎమ్మెల్యేలకు రోజువారీ విధు లను శాసన సభ ప్రధాన కార్యదర్శి ద్వారా ఆఫ్‌లైన్‌లేదాఆన్‌లైన్‌లో కేటా యిస్తారు.




