హిమాచల్‌ ‌సిఎంకు కొరోనా పాజిటివ్‌

సిమ్లా, డిసెంబర్‌ 19 : ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌సింగ్‌ ‌సుఖు కొరోనా బారిన పడ్డారు. సోమవారం ఉదయం 11.00 గంటలకు సుఖ్వీందర్‌ ‌ప్రధాని మోడీతో భేటీ కావాల్సి ఉంది. నిబంధనల ప్రకారం సమావేశానికి ముందు ఆయనకు కొరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. అయితే సుఖ్వీందర్‌కు ఎలాంటి లక్షణాలు లేవు.

దీంతో ఆయన ప్రధానితో భేటీ సహా అన్ని సమావేశాలను రద్దు చేసుకున్నారు. ఐదురోజుల పాటు స్వీయ నిర్బంధంలోకి వెళ్లనున్నారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్‌ ‌సింగ్‌ ‌సుఖు బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. దీంతో మర్యాద పూర్వకంగా నేడు ప్రధానిని కలవనున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *