స్పష్టత లేకుండా గవర్నర్ ప్రసంగం
పంటలకు బోనస్,రుణమాఫీపై దాటవేత
విూడియా పాయింట్ వద్ద హరీష్ రావు
హైదరాబాద్,ప్రజాతంత్ర,ఫిబ్రవరి
ఇప్పుడు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు దరఖాస్తులు తీసుకుంటున్నారని చెప్పారు. బీఆర్‌ఎస్ పాలనలో కలెక్టర్లు దరఖాస్తులు తీసుకునేవారని వెల్లడిరచారు. ప్రజావాణి గురించి గర్నవర్‌తో అర్థసత్యాలు చెప్పించారన్నారు. ఆరు గ్యారంటీల్లో 13 హావిూలున్నాయని చెప్పారు. మహాలక్ష్మి పథకంలో మూడు చెప్పి ఒక గ్యారంటీ అమలుచేశామని చెబుతారా అని ప్రశ్నించారు. ఆరోగ్య శ్రీ అమలు లోపభూయిష్టంగా ఉన్నందునే గవర్నర్ ప్రసంగంలో చెప్పించలేదన్నారు. నిర్దిష్ట సమయంలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందన్నారు. రైతులకు ఇచ్చిన నాలుగు హావిూలు అమలు చేయడం లేదని చెప్పారు. డిసెంబర్ 9న అధికారంలోకి వస్తాం, రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు. అయితే ప్రమాణ స్వీకారాన్ని ముందుకు జరిపి.. హావిూల అమలును వాయిదా వేశారని విమర్శించారు. ఇచ్చిన హావిూలను ఎందుకు నిలబెట్టుకోవడం లేదని ప్రశ్నించారు. వంద రోజుల్లో 60 రోజులు పూర్తయ్యాయ, ఇంకా 40 రోజులే ఉన్నాయని గుర్తుచేశారు. మరో పది రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తుంది.. అప్పటివరకు సాగదీసి హావిూల అమలు వాయిదా వేయాలని ప్రభుత్వం చూస్తున్నదని విమర్శించారు. ఎన్నికల కోడ్ వస్తే హావిూలు ఎలా అమలు చేస్తారని నిలదీశారు. చిత్తశుద్ది ఉంటే హావిూల అమలు గురించి గవర్నర్ ప్రసంగంలో ఉండేదన్నారు.
రూ.500కే గ్యాస్, 200 యూనిట్ల వరకు కరెంట్ గురించి మాత్రమే ప్రస్తావించారని, మిగతా హావిూలు వచ్చే ఏడాదిలో చేయలేమని అని చెప్పకనే చెప్పారని వెల్లడిరచారు. వంద రోజుల్లో అమలు చేయలేమని చేతులెత్తేశారని విమర్శించారు. రూ.15 వేల రైతుభరోసా ఇస్తామన్నారు, 10 వేల రైతుబంధు కూడా ఇవ్వలేదని చెప్పారు. రాష్ట్రంలో రైతులు కరెంట్ కోతలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. వచ్చే యాసంగి పంటకు అయినా బోనస్ ఇస్తామని చెబుతారని ఎదురు చూశాం.. కానీ నిరాశ ఎదురైందన్నారు. రూ. 40 వేల కోట్ల పెట్టుబడిపై వైట్ పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యాదాద్రి పవర్ ప్లాంట్ ఊసేలేదని విమర్శించారు. మూసీ నది ప్రక్షాళన బీఆర్‌ఎస్ ప్రభుత్వమే ప్రారంభించిందని చెప్పారు. ఉద్యోగులకు ఒకటో తేదీన జీతం ఇస్తారన్నారు.. కానీ 7వ తేదీ వచ్చినా జీతాలు పడలేదన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి దారుణం. రెండు, మూడు నెలల నుంచి వారికి జీతాలు లేవన్నారు.





